news18-telugu
Updated: June 29, 2020, 4:15 PM IST
China Apps: చైనా యాప్స్ తొలగించాలా? మీ అభిప్రాయం చెప్పండి
(ప్రతీకాత్మక చిత్రం)
చైనా భారతదేశం సరిహద్దులో ఉన్న దేశం. అయితే ఇటీవల లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైన్యం భారతదేశానికి చెందిన 20 మంది సైనికుల్ని చంపిన సంగతి తెలిసిందే. దీంతో ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యాంటీ చైనా అభిప్రాయం దేశమంతా పెరుగుతోంది. చైనా వస్తువుల్ని నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. చైనా యాప్స్‌ని స్మార్ట్ఫోన్ల నుంచి అన్-ఇన్స్టాల్ చేయాలన్న వాదన కూడా పెరుగుతోంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలదే హవా. హెలో, షేర్ ఇట్, టిక్ టాక్ లాంటి యాప్స్ భారతీయుల రోజువారీ అవసరాల్లో భాగమైపోయాయి. కానీ ఇప్పటికే చాలామం ఈ యాప్స్ తొలగించారు. అసలు చైనా యాప్స్ తొలగించాలన్న వాదనలో మీ అభిప్రాయం ఏంటీ? ఈ పోల్‌లో మీ అభిప్రాయం తెలపండి.
First published:
June 29, 2020, 4:15 PM IST