ఐ లవ్ ఇండియా.. డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికాకు భారత్ గొప్ప భాగస్వామి అని.. అంతకుముందు వైట్‌హౌజ్ ఎకనామిక్ అడ్వైజర్ ల్యారీ కుడ్లో అన్నారు. ప్రధాని మోదీకి డొనాల్డ్ ట్రంప్ మంచి మిత్రుడని ఆయన చెప్పారు.

news18-telugu
Updated: July 17, 2020, 8:11 AM IST
ఐ లవ్ ఇండియా.. డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్, జింపింగ్
  • Share this:
భారత్, చైనా సరిహద్దు వివాదంలో భారత్‌కే అమెరికా మద్దతిస్తోంది. సరిహద్దు దేశాలతో కయ్యాలతో పాటు దక్షిణ చైనా సముద్రంపై డ్రాగన్ పెత్తనాన్ని సహించేది లేదని తెగేసి చెప్పింది. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ నౌకలు, విమానాలను మోహరించి చైనా దూకుడుకు చెక్ పెడుతోంది. ఈ క్రమంలో భారత్, చైనా వివాదంపై అమెరికా అధ్యక్షుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్ ఎనాని తెలిపారు.



భారతీయులు నాకు ఎంతో ఇష్టం. చైనీయులంటే కూడా నాకు ఇష్టం. ఇరుదేశాల ప్రజల శాంతి కోసం ఏం చేయడానికైనా సిద్ధం.
డొనాల్డ్ ట్రంప్


అమెరికాకు భారత్ గొప్ప భాగస్వామి అని అంతకుముందు వైట్‌హౌజ్ ఎకనామిక్ అడ్వైజర్ ల్యారీ కుడ్లో అన్నారు. ప్రధాని మోదీకి డొనాల్డ్ ట్రంప్ మంచి మిత్రుడని ఆయన చెప్పారు. ఇక బుధవారం విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా భారత్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్ తమకు ఎంతో ముఖ్యమని.. భారత విదేశాంగమంత్రితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తరచూ తాము మాట్లాడుకుంటామని.. ఎన్నో అంశాలపై చర్చిస్తామని వెల్లడించారు. భారత్, చైనా సరిహద్దు వివాదంతో పాటు చైనీస్ టెలి కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాతో పొంచి ఉన్నముప్పు గురించి కూడా మాట్లాడుకున్నామని మైక్ పాంపియో పేర్కొన్నారు.

కాగా, అమెరికా, చైనా మధ్య ఇప్పటికే వాణిజ్య యుద్ధం జరుగుతోంది. ఆ తర్వాత చైనాలో కరోనా వైరస్ పుట్టడం.. అది యావత్ ప్రపంచానికి విస్తరించడం, ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ కేసులు, ఎక్కువ మరణాలు చోటుచేసుకోవడంతో.. చైనాపై డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. కరోనాను చైనీస్ వైరస్ అంటూ పలు సందర్భాగాల్లో బాహాటంగానే ఆయన వ్యాఖ్యానించారు. ఇక సౌత్ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపైనా ట్రంప్ కోపంతో ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడ పెద్ద మొత్తంలో యుద్ధ నౌకలు, విమానాలను మోహరిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 17, 2020, 8:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading