VIRAL POSTER SOCIAL MEDIA OF LORD RAMA KILLING DRAGON CHINA IN TAIWAN NEWS MK
చైనా డ్రాగన్ పై రామబాణం...తైవాన్‌లో వైరల్‌గా మారిన చిత్రం ఇదే...
ప్రతీకాత్మకచిత్రం
ఈ వైరల్ చిత్రంలో శ్రీరామ చంద్రుడు డ్రాగన్ పై ధనుర్భాణాలతో దాడి చేసినట్లు చిత్రీకరించారు. ఈ చిత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ చిత్రం శీర్షికలో "మేము జయించాము, మేము చంపాము". ఈ సందేశం ఉంది. తైవాన్ న్యూస్ ఈ ఫోటోను 'ఫోటో ఆఫ్ ది డే' శీర్షికతో ప్రచురించింది.
భారతదేశం-చైనా మధ్య హింసాత్మక ఘర్షణ తరువాత తైవాన్ లో ఒక చిత్రం ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ చిత్రంలో శ్రీరామ చంద్రుడు డ్రాగన్ పై ధనుర్భాణాలతో దాడి చేసినట్లు చిత్రీకరించారు. ఈ చిత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ చిత్రం శీర్షికలో "మేము జయించాము, మేము చంపాము". ఈ సందేశం ఉంది. తైవాన్ న్యూస్ ఈ ఫోటోను 'ఫోటో ఆఫ్ ది డే' శీర్షికతో ప్రచురించింది. శ్రీరాముడు చైనా డ్రాగన్‌ను చంపాడని తైవాన్ న్యూస్ ప్రచురించడం టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది. ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్లో రాముడు డ్రాగన్‌పై ధనువు ఎక్కుపెట్టినట్లు కనిపిస్తోంది. సాధారణంగా, భారత్ లో దసరా సందర్భంగా శ్రీరాముడు రావణ వధ చిత్రాలు వైరల్ అవుతాయి. భారతీయులు ఇటువంటి చిత్రాన్ని చెడుపై మంచి విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు.
ఇదలా ఉంటే లడఖ్ సరిహద్దు సమీపంలో వివాదాస్పద విభాగంలో భారతీయ, చైనా సైనికుల తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో భారత సైనికులు 20 మంది మరణించగా, 4 గురు తీవ్రంగా గాయపడ్డారు. చైనా ఆర్మీకి చెందిన 43 మంది సైనికులు తీవ్రంగా గాయపడగా, అందులో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.