Home /News /india-china /

VIOLENT FACE OFF TOOK PLACE LAST NIGHT AT INDIA CHINA BORDER WITH THREE CASUALTIES FROM INDIAN SIDE NK

చైనా దొంగ బుద్ధి... సరిహద్దుల్లో హింస... ఓ సైనికాధికారి, ఇద్దరు జవాన్ల మృతి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనా ప్రభుత్వం చెప్పినదొకటి... సరిహద్దుల్లో చేసినది మరికొటి. ఇలాగైతే చైనాను ఎలా నమ్మగలం?

    ఇంకేముంది... చైనాతో చర్చలు ఫలవంతం అయ్యాయి.... రెండు దేశాలూ సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయి అనుకున్నామా... అంత లేదు... చైనా తన దొంగ బుద్ధిని చూపించిందని తాజాగా తెలిసింది. అసలేమైందంటే... నిన్న రాత్రి లఢక్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో... రెండు దేశాలూ సైన్యాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి. అలా సైన్యం రెండు వైపులా వెళ్లిపోతున్న సమయంలో... చైనా కవ్వింపు చర్యలకు దిగింది. దాంతో... మన ఇండియన్ ఆర్మీ కూడా రా చూసుకుందాం... నువ్వో నేనో అని తలపడింది. పెద్ద గొడవే జరిగింది. రెండువైపులా రాళ్లు విసురుకున్నారని తెలిసింది. ఈ ఘటనలో... భారత్ వైపు నుంచి ఓ సైనిక అధికారి, ఇద్దరు సైనికులు ఆమరులైనట్లు తెలిసింది.

    ఈ హింసాత్మక కుట్ర తర్వాత... రెండు దేశాల ఉన్నతాధికారులూ... సైన్యాన్ని నెమ్మదించారు. దాంతో రెండు సైన్యాలూ వెనక్కి తగ్గాయి. ఇప్పుడీ అంశంపై... రెండు దేశాల సీనియర్ మిలిటరీ అధికారులు సమావేశమై చర్చించుకుంటున్నారు. ప్రశాంతంగా వెనక్కి తగ్గాల్సిన సమయంలో... మీ ఆర్మీ ఎందుకు రెచ్చగొట్టింది అని భారత్... లేదు మా వాళ్లు అలా చెయ్యలేదు అని చైనా ఆర్మీ అధికారులు చర్చించుకుంటున్నారు. దీనిపై భారత ఆర్మీ ఓ ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.

    నెల నుంచి చైనా ఈ నాటకాలు ఆడుతూనే ఉంది. లఢక్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి పెద్ద కుట్రే పన్నింది. పెద్ద ఎత్తున సరిహద్దుల్లో సైన్యాన్నీ, ఆయుధాల్నీ మోహరించింది. అంతేకాదు... అక్కడ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించింది. ఇదంతా గమనించిన భారత్ కూడా పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించడంతో... చైనా ఆటలు సాగలేదు. అదే సమయంలో... అమెరికా కూడా భారత్ వైపు నుంచి ఒత్తిడి చెయ్యడంతో... చైనాకి తన ఆటలు సాగవని అర్థమైంది. ఆ సమయంలో కమాండర్ స్థాయి నేతలు రెండు వైపులా చర్చలు జరిపి... పరిస్థితిని చక్కదిద్దారు. దాంతో... రెండు దేశాల సైన్యాలూ సరిహద్దుల నుంచి వెనక్కి మళ్లసాగాయి. అదే సమయంలో... రాత్రి గాల్వన్ లోయలో... చైనా ఈ కవ్వింపు చర్యలకు దిగి... ఏకంగా మన సైన్యం ప్రాణాలు తీసింది. దీనిపై ఇప్పుడు భారతీయులు ఆగ్రహంతో ఉన్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: India-China

    తదుపరి వార్తలు