చైనా సరిహద్దుకు వెళ్లబోయిన పిల్లలు... అపిన పోలీసులు... చిన్నారుల్ని మెచ్చుకున్న నెటిజన్లు

చైనాకి వ్యతిరేకంగా... పెద్దవాళ్లకే కాదు... పిల్లల్లోనూ దేశభక్తి ఉప్పొంగుతోంది. ఆ చిన్నారుల బృందాన్ని దేశ ప్రజలు మెచ్చుకుంటున్నారు.

news18-telugu
Updated: June 22, 2020, 12:15 PM IST
చైనా సరిహద్దుకు వెళ్లబోయిన పిల్లలు... అపిన పోలీసులు... చిన్నారుల్ని మెచ్చుకున్న నెటిజన్లు
చైనా సరిహద్దుకు వెళ్లబోయిన పిల్లలు... అపిన పోలీసులు... చిన్నారుల్ని మెచ్చుకున్న నెటిజన్లు (credit - twitter)
  • Share this:
అది ఉత్తరప్రదేశ్... అలీగఢ్ జిల్లాలోని... అమ్రాద్ పూర్. అక్కడి 10 మంది పిల్లలు. అందరి వయసూ... 7 నుంచి 11 ఏళ్ల లోపే. ఇళ్లను వదిలేసి.... చైనా సరిహద్దు వైపు బయల్దేరారు. ఎందుకో తెలిస్తే... ఒకింత ఆశ్చర్యం కలగక మానదు. పరిగెడుతూ వెళ్తున్న ఆ పిల్లల్ని పోలీసులు అడ్డుకున్నారు. "ఏయ్... ఇటెందుకు వెళ్తున్నారు. అది బోర్డర్ ఏరియా... అటు వెళ్లకూడదు" అని పోలీసులు అనగానే... అవును సార్... అది బోర్డర్ కాబట్టే అటు వెళ్తున్నాం అన్నాడు పిల్లల్లో ఒకడైన కరణ్. "ఎందుకూ" అని అడిగితే... "మన సైన్యాన్ని చంపారు... మన తడాఖా చూపిస్తాం. ప్రతీకారం తీర్చుకుంటాం... భారత్ మాతాకీ జై" అని పిల్లలు నినాదాలు చేశారు.

మీరు పిల్లలు కదా... మరి చైనా సైన్యంతో ఫైట్ చెయ్యగలరా అని అడిగితే... పిల్లలంతా కాన్ఫిడెన్స్‌తో కచ్చితంగా చేస్తాం అన్నారు. పోలీసులకు ఆ పిల్లల్లో దేశ భక్తి చూసి ముచ్చటేసింది. ఓకే... ఆ సైనికుల వీర మరణానికి మనం ప్రతీకారం తీర్చుకుందాం. ఇప్పటికైతే మీరు ఇళ్లకు వెళ్లండి. బాగా చదువుకోండి అని పోలీసులు వాళ్లకు చెప్పారు.


గత సోమవారం భారత సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో... చైనా, భారత్ సైన్యం మధ్య ఘర్షణ జరిగి... మన జవాన్లు 20 మంది చనిపోయిన విషయం మనకు తెలుసు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారు. చైనా సంగతి తేల్చాలని పట్టుదలతో ఉన్నారు. చివరకు చిన్న పిల్లలు కూడా అదే ఆవేశంతో ఉన్నారంటే... దేశభక్తి ఎంతలా ఉందో మనం గ్రహించవచ్చు.


ఆ పిల్లల సమాధానం చూసి... నెటిజన్లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల ఉత్సాహం, నిస్వార్థమైన దేశభక్తికి సెల్యూట్ అంటున్నారు.


జనరల్‌గా పిల్లలెవరూ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లరు. కానీ ఈ పిల్లలు మాత్రం... ఇంకా ప్రపంచాన్ని చూడకముందే... ఓ గొప్ప నిర్ణయం తీసుకొని... వీర సైనికుల్లా బయల్దేరడం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ వీడియో వైరల్ అయ్యింది. అందరూ దీన్ని షేర్ చెయ్యాలని కోరుతున్నారు.
First published: June 22, 2020, 12:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading