US MILITARY TO STAND WITH INDIA IN CONFLICT WITH CHINA INDICATES WHITE HOUSE OFFICIAL SK
చైనా సరిహద్దు వివాదంలో మేం భారత్ వైపే.. అమెరికా సంకేతం
ప్రతీకాత్మక చిత్రం
నా పెత్తనాలు చేస్తుంటే ఒక శక్తివంతమైన దేశంగా తాము చూస్తూ ఊరుకోబోమని వైట్ హౌజ్ స్టాఫ్ చీఫ్ మార్క్ మీడోస్ చెప్పారు. వ్యూహాత్మకమైన దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నేవీ రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను మోహరిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంలో భారత్ వైపే నిలుస్తామని అమెరికా సంకేతాలిచ్చింది. ఇండియా-చైనా వివాదమైనా.. మరెక్కడైనా .. అమెరికా మిలటరీ బలంగా నిలబడుతుందని వైట్ హౌజ్ అధికారి ఒకరు తెలిపారు. చైనా పెత్తనాలు చేస్తుంటే.. ఒక శక్తివంతమైన దేశంగా తాము చూస్తూ ఊరుకోబోమని వైట్ హౌజ్ స్టాఫ్ చీఫ్ మార్క్ మీడోస్ చెప్పారు. వ్యూహాత్మకమైన దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నేవీ రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను మోహరిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి ఇండియా చైనా సరిహద్దు వివాదంలో తాము భారత్ వైపేనని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
గత ఏడాది నుంచి అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోంది. దిగుమతులపై ఇరుదేశాలు పరస్పరం భారీగా సంకాలు విధిస్తున్నాయి. ఇక ఈ ఏడాదిలో కరోనా రావడంతో.. అందుకు చైనానే కారణమని అమెరికా పదే పదే విమర్శలు గుప్పిస్తోంది. మీ వల్లే ప్రపంచం నాశనమయిందంటూ ట్రంప్ బాహాటంగానే చైనాపై మండిపడుతున్నారు. ఇక సౌత్ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం పెరగడాన్ని అమెరికా జీర్ణించులేకపోతోంది. చైనాకు చెక్ పెట్టేందుకు యుద్ధ నౌకలను మోహరిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చైనా, ఇండియా వివాదంలో అమెరికా ఖచ్చితంగా ఇండియాకే మద్దతిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.