Home /News /india-china /

UNION MINISTER RAJNATH SINGH CLARIFIES ON INDIA STAND AND BORDER ISSUE WITH CHINA AK

India-China Issue: చైనాతో వివాదంపై లోక్‌సభలో కేంద్రం వివరణ

రాజ్‌నాథ్ సింగ్ (ఫైల్ ఫోటో)

రాజ్‌నాథ్ సింగ్ (ఫైల్ ఫోటో)

India-China standoff: సరిహద్దుల విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలను భారత్ అంగీకరించదనే విషయాన్ని చైనాకు స్పష్టం చేశామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

    భారత్, చైనా మధ్య సరిహద్దు అంశం ఇంకా పరిష్కారం కాలేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు కొంతకాలంగా భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్రం లోక్‌సభలో ప్రకటన చేసింది. ఈ అంశంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ అంశంపై ఇరుపక్షాలకు అమోదయోగ్యమైన పరిష్కారం లభించలేదని ఆయన తెలిపారు. సరిహద్దు విషయంలో చైనా అంగీకరించడం లేదని తెలిపారు. లద్ధాఖ్‌లోని దాదాపు 38 వేల స్క్వేర్ కిలోమీటర్ల అక్రమణలో చైనా ఇంకా తన స్థావరాలను కొనసాగిస్తోందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత్ సైన్యం దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. సరిహద్దుల విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలను భారత్ అంగీకరించదనే విషయాన్ని చైనాకు స్పష్టం చేశామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

    సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అన్నారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించిందని వివరించారు.చైనాతో తాము స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నా డ్రాగన్‌ దూకుడుతో శాంతి ఒప్పందంపై ప్రభావం పడుతోందని, ద్వైపాక్షిక చర్చలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. ఎల్‌ఏసీని ఇరు దేశాలు గౌరవించాలని అన్నారు. చైనా ఏకపక్ష చర్యలను భారత్‌ ఖండిస్తోందని, డ్రాగన్‌ కదలికలను పసిగడుతున్నామని మన సైన్యం కూడా అప్రమత్తంగా ఉందని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.చైనా రక్షణ మంత్రితో తాను చర్చలు జరిపానని, యథాతథ స్థితికి భంగం కలిగించే చర్యలు చేపట్టవద్దని ఆయనతో స్పష్టం చేశానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడ్డాఖ్‌కు వెళ్లి సైనికులను కలిశారని గుర్తు చేశారు. చైనాతో చర్చలకు భారత్‌ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: India-China, Rajnath Singh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు