చైనాకు రెడీగా మరో షాక్... త్వరలో 350 వస్తువులపై నిషేధం...

తలపొగరుతో రెచ్చిపోతున్న డ్రాగన్‌ ఆనందం తీర్చేయడానికి భారత కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన నిర్ణయాలు తీసుకోబోతోంది.

news18-telugu
Updated: July 13, 2020, 6:59 AM IST
చైనాకు రెడీగా మరో షాక్... త్వరలో 350 వస్తువులపై నిషేధం...
చైనాకు రెడీగా మరో షాక్... త్వరలో 350 వస్తువులపై నిషేధం...
  • Share this:
చైనాకి నిలువెల్లా పొగరే. ఎందుకంటే... ప్రపంచం మొత్తం తమపైనే ఆధారపడుతోందనీ, తాము ఇచ్చే వస్తువుల్నే తప్ప వేరే కొనుక్కునే పరిస్థితి ప్రపంచ దేశాలకు లేదనీ అనుకుంటోంది. ఇలాంటి తప్పుడు ఆలోచనకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోబోతోంది. త్వరలో 350 వస్తువుల దిగుమతిని పూర్తిగా నిషేధించబోతోంది. వీటిలో ఎక్కువ భాగం ఎలక్ట్రానిక్ వస్తువులు, టెక్స్‌టైల్స్, బొమ్మలు, ఫర్మిచర్ వంటివే ఉన్నాయి. ఇలాంటివి ఎక్కువగా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. కానీ... దేశీయంగా కూడా వీటిని ఉత్పత్తి చెయ్యవచ్చు. ఆ దిశగా రాష్ట్రాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వీటిని నిషేధిస్తే... చైనాకి చుక్కలు కనిపించకమానవు.

ఇప్పటివరకూ విదేశాల నుంచి వస్తున్న వస్తువులపై కేంద్రం ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు. కానీ చైనా దొంగబుద్ధి తెలిసిన తర్వాత... ఇప్పుడు కేంద్రం ఏకంగా ఓ మానిటరింగ్ వ్యవస్థను పెట్టి... ఏయే వస్తువుల్ని ఇండియా దిగుమతి చేసుకుంటోంది? వాటిలో వేటిని స్థానికంగా తయారుచెయ్యొచ్చు? అన్నది లోతుగా పరిశీలిస్తోంది. ఫలితంగా ఇకపై ఆత్మనిర్భర భారత్ వాణి వినిపించనుంది.

కేంద్రం తాజా అభిప్రాయం వల్ల చాలా లాభాలున్నాయి. దేశీయ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే... చైనా లాంటి దేశాలకు షాక్ తగులుతుంది. విదేశీ మారక ద్రవ్య లోటును తగ్గించవచ్చు. చైనాకు దీటుగా భారత్ ఎదగవచ్చు. ఇలా ఎన్నో లాభాలు ఉండటంతో... నీతి ఆయోగ్, ఆర్థిక శాఖ దీనిపై దృష్టి పెట్టాయి.

నిషేధం విధించాలనుకుంటున్న వస్తువుల విలువ ఏడాదికి 127 బిలియన్ డాలర్లు. ఇంత డబ్బును ఇండియా నుంచి చైనా కొల్లగొడుతోంది. పోనీ మనకు మంచి క్వాలిటీ సరుకు ఇస్తోందా అంటే... అన్నీ యూజ్ అండ్ త్రో టైపే. అదేదో ఇండియాలోనే వాటిని తయారుచేసుకుంటే... ఎక్కువ నాణ్యతతో తయారుచేయవచ్చు. అసలు మేక్ ఇన్ ఇండియా నినాదం తెచ్చుకున్నదే అందుకోసం కదా. అందుకే ఇకపై వస్త్రాలు, తోలు వస్తువులు, బొమ్మలు, ఫర్నిచర్ వంటివి ఇండియాలోనే తయారవ్వనున్నాయి. అలాగే మందులు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు కూడా ఇండియాలోనే పూర్తిగా తయారుచేస్తారు. అంతేకాదు... ఏ వస్తువు ఎక్కడ తయారైందో వాటిపై తప్పనిసరిగా రాస్తారు. తద్వారా అది చైనా వస్తువైతే... భారతీయులు కొనకుండా చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు.
Published by: Krishna Kumar N
First published: July 13, 2020, 6:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading