Home /News /india-china /

TikTok: చైనా నుంచి టిక్‌టాక్ ఔట్? ఎందుకంటే

TikTok: చైనా నుంచి టిక్‌టాక్ ఔట్? ఎందుకంటే

TikTok: చైనా నుంచి టిక్‌టాక్ ఔట్? ఎందుకంటే
(ప్రతీకాత్మక చిత్రం)

TikTok: చైనా నుంచి టిక్‌టాక్ ఔట్? ఎందుకంటే (ప్రతీకాత్మక చిత్రం)

TikTok | టిక్‌టాక్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. టిక్‌టాక్ జన్మస్థలమైన చైనా నుంచి ఈ కంపెనీ బయటకు వచ్చేయాలని భావిస్తోంది. ఎందుకో తెలుసుకోండి.

    భారత ప్రభుత్వం టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో టిక్‌టాక్, హెలో పేరెంట్ కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్ భారీగా నష్టపోతోంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇతర దేశాల్లో బైట్‌డ్యాన్స్ కార్యకలాపాల పైనా ప్రభావం చూపిస్తోంది. దీంతో కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ చేయాలని బైట్‌డ్యాన్స్ భావిస్తోంది. అందులో భాగంగా తమ ప్రధాన కార్యాలయాన్ని చైనా నుంచి తరలించాలని బైట్‌డ్యాన్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమ వ్యాపారాలకు విఘాతం కలగకుండా చైనాతో అన్ని సంబంధాలు తెంచుకోవాలని బైట్‌డ్యాన్స్ ఆలోచిస్తోంది. భారతదేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ పెరిగిపోతుండటం, అమెరికా కూడా టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలన్న దిశగా ఆలోచిస్తుండటం లాంటి పరిణామాలతో చైనా నుంచి తరలిపోవాలని బైట్‌డ్యాన్స్ భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

    Paytm: డబ్బులు లేకపోయినా షాపింగ్... పేటీఎం ఆఫర్

    Smartphone: ఆ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,000 తగ్గింది... 4 రోజులే ఆఫర్

    బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్, హెలో ప్లాట్‌ఫామ్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడవాలంటే చైనా ముద్రను తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే చైనా నుంచి ప్రధాన కార్యాలయాన్ని ఇతర ప్రాంతానికి తరలించి కొత్త మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని బైట్‌డ్యాన్స్ భావిస్తోంది. ఇప్పటికే సీనియర్ ఎగ్జిక్యూటీవ్స్ ఈ ప్రతిపాదనలపై చర్చిస్తున్నారని సమాచారం. కోట్లాది మంది యూజర్లు, కంపెనీ ఉద్యోగులు, కళాకారులు, కంటెంట్ క్రియేటర్స్, భాగస్వాములు, విధాన నిర్ణేతల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకోవచ్చన్న చర్చ జరుగుతోంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: China, India-China, Mobile App, Tik tok, Tiktok

    తదుపరి వార్తలు