• HOME
  • »
  • NEWS
  • »
  • INDIA-CHINA
  • »
  • TIKTOK CONSIDERING LONDON FOR HEADQUARTERS TO DISTANCE CHINESE OWNERSHIP BA

TikTok | టిక్ టాక్ భారీ ప్లాన్.. చైనా బ్రాండ్ నుంచి బయటపడడానికి..

TikTok | టిక్ టాక్ భారీ ప్లాన్.. చైనా బ్రాండ్ నుంచి బయటపడడానికి..

ప్రతీకాత్మక చిత్రం

TikTok | తమ హెడ్ క్వార్టర్‌ను చైనా నుంచి యునైటెడ్ కింగ్ డమ్‌కు మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

  • Share this:
    చైనీస్ కంపెనీ మొబైల్ యాప్ టిక్ టాక్ ఓ ఎత్తు వేస్తున్నట్టు తెలుస్తోంది. చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ యాప్ మీద భారత ప్రభుత్వం తాజాగా బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. మొత్తం 59 యాప్స్‌ను బ్యాన్ చేసింది. టిక్ టాక్ సోదర సంస్థ హలో కూడా బ్యాన్ అయిన జాబితాలో ఉంది. రెండు పెద్ద పెద్ద యాప్స్ బ్యాన్ కావడంతో వాటి మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఓ కొత్త ప్లాన్ వేసినట్టు తెలిసింది. తమ హెడ్ క్వార్టర్‌ను చైనా నుంచి యునైటెడ్ కింగ్ డమ్‌కు మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎన్డీటీవీ కథనాన్ని రాసింది. ఈ మేరకు స్థానిక ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలిపింది. ఏ దేశానికి మార్చాలనే అంశంపై లండన్ కూడా పరిశీలనలో ఉందని, అయితే, ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఆ ఇతర ప్రాంతాలు ఏవనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మరోవైపు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఏడాది టిక్ టాక్ కంపెనీ భారీ ఎత్తున రిక్రూట్ మెంట్ చేపట్టింది. వాల్ట్ డిస్నీ కి చెందిన కెవిన్ మేయర్‌ను టిక్ టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించింది. ఆయన అమెరికాకు చెందిన వారు.

    మరోవైపు అమెరికాలో కూడా టిక్ టాక్‌కు చాలా కఠిన కాలం ఎదుర్కోంటోంది. చైనాతో సంబంధాల కారణంగా ఆ దేశానికి చెందిన కంపెనీల మీద అగ్రరాజ్యం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. గత కొన్ని వారాలుగా బైట్ డ్యాన్స్ కంపెనీ దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చైనా బయట ముఖ్యమైన ప్రాంతాల్లో టిక్ టాక్ సంస్థ రాబోయే సంవత్సరాల్లో భారీ ఎత్తున రిక్రూట్ మెంట్ చేయబోతోందని, మరీ ముఖ్యంగా లండన్‌లో రిక్రూట్ మెంట్ ఉంటుందని చెబుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు