భారత ప్రభుత్వం టిక్‌టాక్ సహా 59 యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు చైనీస్ యాప్స్ వాడినవారంతా ప్రత్యామ్నాయ యాప్స్ కోసం వెతుకుతున్నారు. మీకు కూడా ఆల్టర్నేట్ యాప్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇక పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా భారతదేశానికి చెందిన 'చింగారీ' యాప్ డౌన్‌లోడ్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ప్లేస్టోర్‌లోనే 50 లక్షల డౌన్లోడ్స్ పూర్తి చేసుకోవడం విశేషం. బెంగళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్, సిద్దార్థ్ గౌతమ్ గతేడాది 'చింగారీ' యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌లో వీడియోలు అప్లోడ్, డౌన్లోడ్ చేయొచ్చు. స్నేహితులకు షేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ చేయడంతో కొత్త వారితో ఇంటరాక్ట్ కావొచ్చు.
Alternative Apps: టిక్‌టాక్, హెలో, షేర్ ఇట్ యాప్స్‌కు ప్రత్యామ్నాయ యాప్స్ ఇవే
చైనాకు చెందిన యాప్స్‌ని నిషేధించాలన్న వాదన మొదలైన దగ్గర్నుంచీ 'చింగారీ' యాప్‌కు యూజర్లు పెరిగారు. గత కొన్ని రోజులుగా సబ్స్క్రైబర్స్ 400 శాతం పెరిగారని 'చింగారీ' యాప్ రూపకర్త బిస్వాత్మ నాయక్ తెలిపారు. ఈ యాప్‌లో వీడియో వైరల్ అయితే యూజర్లకు రివార్డ్స్ కూడా వస్తాయి. చింగారీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బంగ్లా, మళయాళం లాంటి భాషల్లో ఉపయోగించొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, China, India-China, Indo China Tension, Mobile App, Playstore, Tik tok, Tiktok