TikTok: యాప్ నిషేధించడంతో టిక్‌టాక్‌కు ఎంత నష్టమో తెలుసా?

TikTok | టిక్‌టాక్, హెలో యాప్స్ భారతదేశంలో బ్యాన్ చేయడంతో వాటి పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్‌ భారీగా నష్టపోతోంది.

news18-telugu
Updated: July 2, 2020, 3:35 PM IST
TikTok: యాప్ నిషేధించడంతో టిక్‌టాక్‌కు ఎంత నష్టమో తెలుసా?
TikTok: యాప్ నిషేధించడంతో టిక్‌టాక్‌కు ఎంత నష్టమో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత ప్రభుత్వం టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌ని నిషేధించడం సంచలనం సృష్టించింది. ఈ వార్తను చైనా మీడియా కూడా విస్తృతంగా కవర్ చేసింది. చైనా ప్రభుత్వానికి చెందిన ది గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం టిక్‌టాక్‌, హెలో మాతృ సంస్థ అయిన బైట్‌డ్యాన్స్ 6 బిలియన్ డాలర్లు నష్టపోనుంది. అంటే సుమారు రూ.45,000 కోట్లు. మొబైల్ యాప్ అనాలిసిస్ కంపెనీ సెన్సార్ టవర్ లెక్కల ప్రకారం భారతదేశంలో టిక్‌టాక్‌ను మేలోనే 11.2 కోట్ల సార్లు డౌన్‌‌లోడ్ చేశారు. ప్రపంచమంతా చూసినా భారతదేశంలోనే ఎక్కువగా టిక్‌టాక్ యూజర్లు ఉన్నారు. అమెరికా కన్నా రెట్టింపు సంఖ్యలో టిక్‌టాక్ యూజర్లు ఇండియాలో ఉన్నారు.

Alternative Apps: టిక్‌టాక్, హెలో, షేర్ ఇట్ యాప్స్‌కు ప్రత్యామ్నాయ యాప్స్ ఇవే

Jio offer: జియో యూజర్లకు ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్... ప్లాన్స్ ఇవే

భారత ప్రభుత్వం టిక్‌టాక్, హెలోతో పాటు షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, క్లబ్ ఫ్యాక్టరీ, ఎంఐ కమ్యూనిటీ లాంటి 59 యాప్స్‌ని నిషేధించింది. ప్రైవసీ, జాతీయ భద్రతకు ముప్పు ఉందన్న కారణంతో భారత ప్రభుత్వం ఈ యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. భారతదేశ భద్రత, రక్షణ, సార్వభౌమాధికారం, సమగ్రత కోసం చైనా యాప్స్‌ని ప్రభుత్వం నిషేధించినట్టు కేంద్ర న్యాయ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో చైనా పెట్టుబడిదారులు, వ్యాపారుల విశ్వాసానికి తీవ్ర దెబ్బ తగిలిందని గ్లోబల్ టైమ్స్ విశ్లేషించింది.

 
First published: July 2, 2020, 3:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading