విచ్ఛిన్న శక్తుల కుట్రలను తిప్పికొట్టారు.. సైన్యంపై మోదీ ప్రశంసలు

వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుందన్నారు ప్రధాని మోదీ. బలహీనులు శాంతిని సాధించలేరన్న ఆయన.. శాంతిని సాధించాలంటే ధైర్య సాహసాలు ఉండాలని పేర్కొన్నారు.

news18-telugu
Updated: July 3, 2020, 3:03 PM IST
విచ్ఛిన్న శక్తుల కుట్రలను తిప్పికొట్టారు.. సైన్యంపై మోదీ ప్రశంసలు
వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుందన్నారు ప్రధాని మోదీ. బలహీనులు శాంతిని సాధించలేరన్న ఆయన.. శాంతిని సాధించాలంటే ధైర్య సాహసాలు ఉండాలని పేర్కొన్నారు.
  • Share this:
గల్వాన్ ఘటనతో భారత సైన్యం శక్తి సామర్థ్యాలు మరోసారి ప్రపంచానికి తెలిశాయని ప్రధాని మోదీ అన్నారు. 14 కార్ప్స్ శౌర పరాక్రమం గురించి దేశమంతటా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. విచ్ఛిన్న శక్తుల కుట్రలను సైనికులు, లద్దాఖ్ ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. భారత్ జోలికి వస్తే గట్టిగా బుద్ధి చెబుతామని పరోక్షంగా చైనాకు వార్నింగ్ ఇచ్చారు. లద్దాఖ్‌లో ఆకస్మికంగా పర్యటించిన ప్రధాని మోదీ.. ఆర్మీ అధికారులతో భేటీ అయ్యారు. చైనా సరిహద్దులో తాజా పరిస్థితిని ఆయన సమీక్షించారు. అనంతరం సైనికులనుద్దేశిచి ప్రసంగించారు ప్రధాని మోదీ. సరిహద్దులో సైనికులు ఉండబట్టే దేశం మొత్తం నిశ్చింతగా ఉందని.. దేశ ప్రజలందరి ఆశీస్సులు మీతో ఉన్నాయని చెప్పారు.

గల్వాన్ ఘర్షణలో అమరులైన వీరులకు మరోసారి నివాళి అర్పిస్తున్నా. దేశమంతా మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతోంది. 14 కార్ప్స్ శౌర్య పరాక్రమాల గురించి యావత్ దేశ మాట్లాడుకుంటోంది. ఈ భూమి 130 కోట్ల ప్రజలకు ప్రతీక. విచ్ఛిన్న శక్తుల కుట్రలను లద్దాఖ్ ప్రజలు తిప్పికొట్టారు. ఈ వీర భూమి. వీరులను కన్నభూమి. మన సంకల్పం హిమాలయాల కన్నా ఎత్తైనది. భారత శత్రువులు మీ ఆగ్రహావేశాలను కళ్లారా చూశాయి. వేల సంవత్సరాల నుంచి ఎన్నో దాడులను తిప్పికొట్టాం. ఇవాళ మన శక్తి సామర్థ్యాలు అజేయం. జల, వాయు, పదాతి, అంతరిక్షంలో మనం శక్తివంతగా ఉన్నాం. ఇది రాజ్యాలను విస్తరించే కాలం కాదు. అభివృద్ధి యుగం.
ప్రధాని మోదీమనమంతా పిల్లనిగ్రోవి వాయించే కృష్ణుడిని పూజిస్తామని.. అదే క్రమంలో సుదర్శన చక్రాన్ని ధరించే కృష్ణుడిని అనుసరిస్తామని ప్రధాని మోదీ అన్నారు. తాము శాంతిని కోరుతామని.. కానీ ఎవరైనా రెచ్చగొడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని పరోక్షంగా స్పష్టం చేశారు. వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుందన్నారు ప్రధాని మోదీ. బలహీనులు శాంతిని సాధించలేరన్న ఆయన.. శాంతిని సాధించాలంటే ధైర్య సాహసాలు ఉండాలని పేర్కొన్నారు.
First published: July 3, 2020, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading