India-China Clash | చైనాతో ఘర్షణపై ప్రధాని మోదీకి కేసీఆర్ మద్దతు..

చైనా గానీ, మరే దేశంగానీ భారత్ సార్వభౌమత్వం విషయంలో వేలు పడితే, తప్పక ప్రతిఘటించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

news18-telugu
Updated: June 17, 2020, 6:51 PM IST
India-China Clash | చైనాతో ఘర్షణపై ప్రధాని మోదీకి కేసీఆర్ మద్దతు..
కేసీఆర్, నరేంద్రమోదీ
  • Share this:
దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో భారత్ – చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణ అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. చైనా గానీ, మరే దేశంగానీ భారత్ సార్వభౌమత్వం విషయంలో వేలు పడితే, తప్పక ప్రతిఘటించాలని, తగిన సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారు. దేశ రక్షణ విషయంలో ఎవరూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయం ఇదని సీఎం అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభంలో ప్రధాన మంత్రితో పాటు, అందరు ముఖ్యమంత్రులు లద్దాక్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో చనిపోయిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు.
First published: June 17, 2020, 6:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading