India-China Clash | మేడిన్ చైనా కాస్ట్‌లీ టీవీ పగలగొట్టి నిరసన...

గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వ్యక్తి ఖరీదైన మేడిన్ చైనా టీవీని పగలగొట్టి తన నిరసన తెలిపాడు.

news18-telugu
Updated: June 17, 2020, 10:44 PM IST
India-China Clash | మేడిన్ చైనా కాస్ట్‌లీ టీవీ పగలగొట్టి నిరసన...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రస్తుతం భారత్, చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ భారతీయుడు తనకు చైనా మీద ఉన్న కోపాన్ని ఇలా వెరైటీగా తీర్చుకున్నాడు. చైనాలో తయారైన కంపెనీ టీవీని పగులగొట్టి తమ నిరసన తెలిపాడు. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన జరిగింది. సూరత్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే వ్యక్తి తమ ఇంట్లో ఉన్న ఖరీదైన 42 అంగుళాల టీవీని రెండో అంతస్తు నుంచి కిందపడేశాడు. అనంతరం ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించే మరికొందరు కూడా కలసి ఆ టీవీని పగలగొట్టారు. ముక్కలు ముక్కలు చేశారు. అనంతరం చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా వైరస్ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్‌గా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దేశ ప్రజలు బాయ్ కాట్ చైనా అంటూ చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ పిలుపునిస్తున్నారు. తాజాగా 20 మంది భారత సైనికులు చైనీస్ ఆర్మీతో ఘర్షణలో ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో చైనా మీద, చైనీస్ ఉత్పత్తుల మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

First published: June 17, 2020, 7:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading