చైనా విషయంలో ఏది నిజం? వీడియో పోస్ట్ చేసిన రాహుల్.. ప్రధానికి ప్రశ్నలు

ప్రధాని మోదీ శుక్రవారం లద్దాఖ్‌లో ఆకస్మిక పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. ఉదయం లేహ్‌కు చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి నిమ్మూకు వెళ్లారు. అక్కడ ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశమై ఇండియా, చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితిని సమీక్షించారు.

news18-telugu
Updated: July 3, 2020, 5:19 PM IST
చైనా విషయంలో ఏది నిజం? వీడియో పోస్ట్ చేసిన రాహుల్.. ప్రధానికి ప్రశ్నలు
రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ
  • Share this:
భారత్, చైనా సరిహద్దు వివాదం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా? లేదా? చెప్పాలని ప్రధాని మోదీని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కొన్ని రోజులుగా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ప్రధాని మోదీ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. చైనా బలగాలు భారత్ భూభాగంలో అడుగుపెట్టలేదని, ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఐతే తాజాగా రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీకి ప్రశ్నలు సందించారు. లద్దాఖ్ ప్రజలు మాట్లాడుతున్న వీడియోను ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. చైనా బలగాలు భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని లద్దాఖీలు చెబుతున్నారని..ప్రధాని మోదీ మాత్రం ఎవరూ రాలేదని చెబుతున్నారని.. ఇందులో ఏది నిజమని ప్రశ్నించారు. ఎవరో ఒకరు అబద్ధాలు చెబుతున్నారని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.
కాగా, ప్రధాని మోదీ శుక్రవారం లద్దాఖ్‌లో ఆకస్మిక పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. ఉదయం లేహ్‌కు చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి నిమ్మూకు వెళ్లారు. అక్కడ ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశమై ఇండియా, చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితిని సమీక్షించారు. అనంతరం సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. గల్వాన్ ఘటనతో భారత సైన్యం శక్తి సామర్థ్యాలు మరోసారి ప్రపంచానికి తెలిశాయని అన్నారు. 14 కార్ప్స్ శౌర పరాక్రమం గురించి దేశమంతటా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. విచ్ఛిన్న శక్తుల కుట్రలను సైనికులు, లద్దాఖ్ ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. భారత్ జోలికి వస్తే గట్టిగా బుద్ధి చెబుతామని పరోక్షంగా చైనాకు వార్నింగ్ ఇచ్చారు. అనంతరం లేహ్‌లోని మిలటరీ ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని మోదీ.. గల్వాన్ ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించారు.
First published: July 3, 2020, 5:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading