గాల్వాన్ లోయ నుంచి వెళ్లిపోయిన చైనా సైన్యం... శాటిలైట్ దృశ్యాల్లో...

గాల్వాన్ నదీ లోయలో... చైనా సైన్యం వెనక్కి వెళ్లడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి.

news18-telugu
Updated: July 8, 2020, 8:30 AM IST
గాల్వాన్ లోయ నుంచి వెళ్లిపోయిన చైనా సైన్యం... శాటిలైట్ దృశ్యాల్లో...
ఎడమవైపున జూన్ 28న గాల్వాన్ లోయలో... చైనా సైన్యం, శిబిరాలు... కుడివైపున జులై 6న సైన్యం, శిబిరాలు లేకుండా గాల్వాన్ లోయ (image credit - twitter - Yash Srivastava)
  • Share this:
లఢక్‌లోని గాల్వాన్ నదీ లోయ నుంచి నిజంగానే చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోయిందా? అక్కడి టెంట్లు, శిబిరాల్ని నిజంగానే తొలగించిందా? అనే డౌట్ ఇండియాలో చాలా మందికి ఉంది. ఎందుకంటే... జిత్తులమారి డ్రాగన్ చెబుతున్నదొకటీ... చేస్తున్నదొకటీ. కానీ... తాజాగా శాటిలైజ్ ఇమేజెస్ విడుదలయ్యాయి. వాటి ద్వా్రా... చైనా నిజంగానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 2 నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన గాల్వాన్ లోయతోపాటూ హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా ప్రాంతాల నుంచి ఇండియా, చైనా సైనికులు వెనక్కి వెళ్తున్నట్లు క్లియర్‌గా అర్ధమవుతోంది.

india china dispute, india china face off, india china tension, galwan valley, satellite images, china army, indian army, గాల్వాన్ లోయ శాటిలైట్ ఫొటోలు, ఇండియా చైనా ఘర్షణ, భారత్ చైనా సరిహద్దు, చైనా సైన్యం, భారత సైన్యం,
ఎడమవైపున జూన్ 28న గాల్వాన్ లోయలో... చైనా సైన్యం, శిబిరాలు... కుడివైపున జులై 6న సైన్యం, శిబిరాలు లేకుండా గాల్వాన్ లోయ (image credit - twitter - Yash Srivastava)


జూన్ 30న రెండు దేశాల మధ్య కోర్ కమాండర్లు చర్చించారు. రెండువైపులా 3 కిలోమీటరలు వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా... సోమవారం నుంచి వెనకడుగులు వేస్తున్న డ్రాగన్ సైన్యం... మంగళవారం కూడా ఛలో ఛలో అంటూ వెనక్కి వెళ్లింది. ఇదంతా ఓవైపు గమనిస్తూనే... మరోవైపు భారత బలగాలు కూడా... సరిహద్దు నుంచి వెనక్కి మళ్లుతున్నాయి. మరోవైపు... చైనా మళ్లీ ఎక్స్‌ట్రాలు చేస్తే... డ్రాగన్ తోక కట్ చెయ్యడానికి ఏం చెయ్యాలో... అన్ని ఏర్పాట్లూ భారత్ చేస్తూనే ఉంది.

(ఎడమవైపు) ప్రస్తుతం గాల్వాన్ లోయ, (కుడివైపు) ఇంతకుముందు చైనా శిబిరాలతో గాల్వాన్ లోయ (image credit - twitter - Congress Hands)


చైనా తాజాగా ఏం చేసిందంటే:
- గాల్వాన్‌ లోయ నుంచి చైనా తన సైన్యాన్ని 2 కిలోమీటర్లు వెనక్కి తెప్పించుకుంది. అక్కడి పెట్రోలింగ్‌ పాయింట్‌-14 దగ్గర తన గుడారాలను తీసేసింది.
- రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణలు జరిగిన హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా ప్రాంతాల నుంచి బీజింగ్ సైన్యం 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లింది.- ఇండియా కూడా వెనక్కి వెళ్లడంతో... ఇప్పుడు హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా, గాల్వాన్ లోయ ప్రదేశాలు సైనికులు లేకుండా మారిపోయాయి.
- ప్యాంగాంగ్‌ సరస్సు దగ్గర మాత్రం చైనా తన సైన్యాన్ని అలాగే ఉంచింది. పైగా ఇక్కడ 190 నిర్మాణాలు ఏర్పాటుచేసింది. త్వరలో రెండుదేశాల మధ్య మళ్లీ చర్చలున్నాయి. ఆలోగా సైన్యం వెళ్లిపోతుందేమో చూడాలి.
Published by: Krishna Kumar N
First published: July 8, 2020, 8:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading