Home /News /india-china /

RAFALE FIGHTER JETS REACHING AMBALA AIRBASE TOMORROW TO BE GAME CHANGER FOR IAF CHINA PAKISTAN TENSION MK

Rafale Fighter Jets: అంబాలాలో హై అలర్ట్...రాఫెల్ రాక నేపథ్యంలో చైనా, పాక్ వెన్నులో వణుకు...

అంబాలా ఎయిర్‌బేస్ 3 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని నో డ్రోన్ జోన్‌గా ప్రకటించగా, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక డీఎస్పీ చెప్పారు.

అంబాలా ఎయిర్‌బేస్ 3 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని నో డ్రోన్ జోన్‌గా ప్రకటించగా, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక డీఎస్పీ చెప్పారు.

అంబాలా ఎయిర్‌బేస్ 3 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని నో డ్రోన్ జోన్‌గా ప్రకటించగా, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక డీఎస్పీ చెప్పారు.

    భారత్-చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్తత మధ్య రాఫెల్ విమానాలు భారత్‌కు వస్తున్నాయి , బుధవారం అంబాలా ఎయిర్‌బేస్‌లో రాఫెల్ విమానాలు సందడి చేయనున్నాయి. ఈ శుభవార్తతో దేశంలోని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు. ఫ్రాన్స్ నుండి ప్రారంభమైన ఈ రాఫెల్ ప్రయాణాన్ని చైనా, పాకిస్తాన్ చాలా సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇరు దేశాల అధినేతలకు రాఫెల్ బలం చేకూరిన తరువాత ఇక భారత వైమానిక దళంతో పోరాడటం కష్టమని చాలా బాగా తెలుసు. దీంతో ఇక చేసేదేమీ లేక ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి.

    అంబాలాలో హై అలర్ట్:

    చైనా సరిహద్దు నుండి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబాలా ఎయిర్‌బేస్‌లో ఈ రాఫెల్ యుద్ధ విమానాలను మోహరించనున్నారు. ఈ నేపథ్యంలో అంబాలా ఎయిర్‌బేస్‌లో బలమైన ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో, భద్రత దృష్ట్యా, పరిపాలన అంబాలా ఎయిర్‌బేస్‌కు సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుంది. ఇప్పటికే రాఫెల్ కోసం ఎయిర్‌బేస్‌లు సిద్ధంగా ఉండగా, ఇప్పుడు వైమానిక దళం అంబాలా ఎయిర్‌బేస్ 3 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని నో డ్రోన్ జోన్‌గా ప్రకటించింది. అంబాలా ఎయిర్‌బేస్‌లో సెటిల్మెంట్ గురించి స్థానిక కంటోన్‌మెంట్ డిఎస్పీ మాట్లాడుతూ ఇది అంబాలాకు గర్వకారణమని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    Rafale, Rafale deal, rafale news, rafale air base, రాఫెల్ యుద్ధ విమానాలు, రాఫెల్ జెట్స్, రాఫెల్ వార్తలు,
    రాఫెల్ యుద్ధ విమానాలు... (credit - twitter)


    సోమవారం ఫ్రాన్స్‌కు చెందిన మెరినాక్ ఎయిర్‌బేస్ నుంచి ప్రయాణించిన తరువాత, 5 రాఫెల్ విమానాలు 5000 కిలోమీటర్లు ప్రయాణించి యుఎఇ యొక్క అల్ దఫ్రా ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి, ఇప్పుడు అంబాలా ఎయిర్‌బేస్‌లో రాఫెల్‌కు టచ్‌డౌన్ కు కేవలం 2000 కిలోమీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది. ఈ విమానంలో రాఫెల్ విమానాలతో పాటు ఎయిర్ రీఫ్యూయలింగ్ విమానం కూడా ఉంది. 7 గంటలకు పైగా ఉన్న ఈ విమానంలో, రాఫెల్ విమానాలు ఒకటి కంటే ఎక్కువసార్లు ఇంధనం నింపారు. ఫ్రాన్స్‌లో మరో 5 రాఫెల్ విమానాలు తయారు చేస్తుండగా, భారత పైలట్లు ప్రస్తుతం ఆ యుద్ధ విమానాలపై శిక్షణ పొందుతున్నారు.



    రాఫెల్ జెట్ రాకతో చైనా, పాక్ వెన్నులో వణుకు

    చైనా-పాకిస్థాన్‌లు సంయుక్తంగా పోరాడినా రాఫెల్ ను ఎదిరించే సత్తా వారికి లేదని నిపుణులు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఒక రాఫల్ ఒకేసారి 8 శత్రు స్థావరాలపై నిఘా ఉంచగలదు అలాగే వాటిపై దాడి కూడా చేస్తుంది. ఇప్పుడు పాకిస్థాన్‌కు చెందిన రెండు ఎఫ్ -16 యుద్ధ విమానాలు ఒక భారత రాఫెల్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ క్షిపణులను వందల కిలోమీటర్ల నుండి వాటిని పర్యవేక్షించవచ్చు మొత్తంమీద, పాకిస్తాన్ ఆయుధాలన్నీ రాఫెల్ ముందు చాలా పాతవిగా కనిపిస్తాయి.

    రాఫెల్ వచ్చిన తరువాత, భారత వైమానిక దళం బలం అమాంతం పెరుగుతుందని, పాకిస్తాన్ ఎఫ్ -16 , చైనా జె -11 కన్నా రాఫెల్ మరింత శక్తి వంతమైనదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: India-China, Indian Air Force, Indo China Tension

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు