news18-telugu
Updated: September 2, 2020, 8:58 PM IST
pubg (ప్రతీకాత్మక చిత్రం )
Pubg Ban in India: కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా చైనీస్ యాప్స్ మీద వేటు వేసింది. 118 చైనీస్ యాప్స్‌ను భారత్‌లో బ్యాన్ చేసింది. అందులో PUBG కూడా ఉందని అంతా అనుకున్నారు. అయితే, కేంద్రం బ్యాన్ చేసిన యాప్స్ జాబితాలో PUBG లేదు. PUBG Mobile మాత్రమే ఉంది. కేంద్రం బ్యాన్ చేసిన 118యాప్స్ లిస్టులో PUBG Mobile Nordic Map: Livik, PUBG Mobile Lite, WeChat Work, WeChat reading, PUBG Mobile లాంటివి ఉన్నాయి. కానీ, PUBG మాత్రం లేదు. PUBG అనేది పర్సనల్ కంప్యూటర్ కోసం తయారు చేసిన గేమ్. దాన్ని PUBG కార్పొరేషన్ తయారు చేసింది. ఇది కొరియన్ కంపెనీ. PUBG, PUBG Mobile రెండింటి పేర్లు ఒకేలా ఉన్నాయి. దీంతో అంతా PUBG బ్యాన్ అయిందనుకున్నారు. PUBG Mobile అనేది మొబైల్ యూజర్స్ కోసం తయారు చేసింది. ఇది చైనీస్ కంపెనీ Tencent తయారు చేసింది. అందుకే ఇంకా పర్సనల్ కంప్యూటర్స్‌లో ఈ గేమ్ ఇంకా అందుబాటులో ఉంది.
భద్రతా పరమైన అంశాల కారణంగా ఇప్పటికే గతంలో 59కి పైగా మొబైల్ యాప్స్‌ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో 118 యాప్స్ మీద వేటు వేసింది. రెండు నెలల క్రితం భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం టిక్‌టాక్, హలో సహా 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది. చైనాతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 59 చైనా యాప్లను నిషేధిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్ జాబితాలో టిక్టాక్, షేర్ఇట్, యుసీ బ్రౌజర్, బైదు మ్యాప్, హెలో, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్ ఫ్యాక్టరీ, వీచాట్, యుసి న్యూస్, వీబో, జెండర్, మీటు, కామ్స్కానర్, క్లీన్ మాస్టర్ - చీతా మొబైల్ ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులలో భారత ప్రభుత్వం ఈ 59 యాప్స్ ను భారతదేశ సార్వభౌమాధికారం సమగ్రత, దేశ యొక్క రక్షణ, భద్రత దృష్ట్యా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఆ తరువాత మరిన్ని కొన్ని యాప్స్‌ను ఈ జాబితాలో చేర్చింది. తాజాగా పబ్జీ సహా మరికొన్ని మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
September 2, 2020, 8:56 PM IST