PUBG Ban: పబ్ జీని కూడా బ్యాన్ చేయాల్సిందే...భారత నెటిజన్స్ డిమాండ్

PUBG Ban Trending | చైనా యాప్స్‌ని బ్యాన్ చేయడం ద్వారా డ్రాగన్ దేశం ఆర్థిక మూలాలు కదులుతున్నాయని..చైనాకు భారత్ సరైన సమాధానమిచ్చిందని పొంగిపోతున్నారు. అయితే ఈ నిషేధిత చైనీస్ యాప్స్ జాబితాలో పబ్‌జీ లేకపోవడం మాత్రం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

news18-telugu
Updated: June 30, 2020, 11:14 AM IST
PUBG Ban: పబ్ జీని కూడా బ్యాన్ చేయాల్సిందే...భారత నెటిజన్స్ డిమాండ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టిక్ టాక్ సహా 59 చైనా యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం తెలిసిందే. ఓ రకంగా ఇది చైనాపై భారత్ చేస్తున్న డిజిటల్ యుద్ధంగా అభివర్ణిస్తున్నారు నెటిజన్స్. చైనా యాప్స్‌ని బ్యాన్ చేయడం ద్వారా డ్రాగన్ దేశం ఆర్థిక మూలాలు కదులుతున్నాయని..చైనాకు భారత్ సరైన సమాధానమిచ్చిందని పొంగిపోతున్నారు. అయితే ఈ నిషేధిత చైనీస్ యాప్స్ జాబితాలో పబ్‌జీ లేకపోవడం మాత్రం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. పబ్‌జీని ఎందుకు బ్యాన్ చేయలేదన్న అంశంపై నెటిజన్లు ఆరాతీస్తున్నారు.  నిషేధిత యాప్స్ జాబితాలో పబ్‌జీని కూడా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.  పబ్ జీని చైనా నుంచి ప్రమోట్ చేస్తున్నా...దీని డెవలపర్ ఇర్లాండ్ దేశానికి చెందిన బ్రెండన్ గ్రీన్ అయినందునే దీన్ని భారత్‌లో నిషేధించలేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే యువతలో హింసాత్మక ప్రవృత్తిని పెంచిపోషిస్తున్న పబ్ జీని కూడా దేశంలో బ్యాన్ చేయాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.#pubgban హ్యాష్ టాక్‌ను ట్రెండ్ చేస్తున్నారు.



చైనా మూలాలున్న అన్ని యాప్స్‌ను దేశంలో బ్యాన్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. నిషేధాన్ని కేవలం కాగితాలకు పరిమితం చేయకుండా...దీన్ని కఠినంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే చైనా ఉత్పత్తులను కూడా బ్యాన్ చేయాడం ద్వారా చైనా ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బ తీయాలని నెటిజన్లు కోరుతున్నారు. చైనా ఆప్స్‌ను బ్యాన్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పబ్‌జీ వినియోగదారుల ఆలోచనలపై ట్రోల్స్ చేస్తున్నారు.
First published: June 30, 2020, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading