లద్ధాక్ అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళి.. చైనాకు హెచ్చరిక...

‘భారత్ శాంతి కోరుకుంటోంది. కానీ, సరైన సమయం వస్తే దీటుగా జవాబు ఇవ్వడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.’ అని ప్రధాని మోదీ అన్నారు.

news18-telugu
Updated: June 17, 2020, 3:35 PM IST
లద్ధాక్ అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళి.. చైనాకు హెచ్చరిక...
చైనాతో జరిగిన ఘర్షణలో చనిపోయిన జవాన్లకు ప్రధాని మోదీ నివాళి (Image;ANI)
  • Share this:
గాల్వన్ ర్యాలీలో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీతో జరిగిన ఘర్షణలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొందరు లెఫ్టినెంట్ గవర్నర్లతో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ లద్దాక్ అమర జవాన్లకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జవాన్ల బలిదానాలు ఊరికేపోవని, ఈ అంశంపై ఎవరికీ అనుమానం వద్దని స్పష్టం చేశారు. ‘అమరులైన బలిదానాలు ఊరికేపోవు.  ఈ అంశంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు. భారత్ శాంతి కోరుకుంటోంది. కానీ, సరైన సమయం వస్తే దీటుగా జవాబు ఇవ్వడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అమర జవాన్ల విషయంలోదేశం గర్వ పడుతుంది. వారు పోరాడుతూ ప్రాణాలు అర్పించారు.’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్  గవర్నర్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమర జవాన్లకు అంజలి ఘటించారు.

First published: June 17, 2020, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading