ప్రధాని మోదీ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి... మన్మోహన్ సింగ్ కౌంటర్

ఇప్పటివరకూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్... ప్రధాని మోదీపై తీవ్ర పదజాలం వాడలేదు. ఇప్పుడు మాత్రం స్వరం పెంచారు.

news18-telugu
Updated: June 22, 2020, 11:24 AM IST
ప్రధాని మోదీ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి... మన్మోహన్ సింగ్ కౌంటర్
ప్రధాని మోదీ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి... మన్మోహన్ సింగ్ కౌంటర్ (File)
  • Share this:
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అలా అన్నారంటే... చాలా మంది నమ్మరు. ఆయన అంత తీవ్రంగా విమర్శలు చెయ్యరనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కానీ... ఈసారి లడక్ విషయంలో... మన్మోహన్ సింగ్... ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గట్టిగానే కార్నర్ చేశారు. లడక్ విషయంపై మాట్లాడేటప్పుడు... మైండ్‌తో ఆలోచించి మాట్లాడాలని మోదీకి సెటైర్ వేశారు. 20 మంది భారత సైనికులు అమరులైన ఘటనపై... శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో... చైనా సైనికులు... భారత సరిహద్దుల్లోకి రాలేదన్నట్లుగా ప్రధాని మోదీ మాట్లాడారు. ఇప్పుడు ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేతలు గట్టిగా పట్టుకున్నారు. చైనా సైనికులు భారత సరిహద్దుల్లోకి రాకపోతే... మన సైనికులు ఎందుకు 20 మంది చనిపోయారో చెప్పాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే యువనేత రాహుల్ గాంధీ... ప్రధాని మోదీని.... సరెండర్ మోదీ అని ట్వీట్ చేయడంపై పెద్ద దుమారం రేగగా... ఇప్పుడు మన్మోహన్ సింగ్ కూడా గట్టిగా విమర్శించడం హాట్ టాపిక్ అయ్యింది.

మన భూభాగాన్ని కాపాడేందుకు... కల్నల్ సంతోష్ బాబు సహా... 20 మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారన్న మన్మోహన్ సింగ్... ప్రధాని మోదీ... ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని... వారికి న్యాయం జరిగేలా... చేయాలన్నారు. తగిన న్యాయం చేయకపోతే... అది ప్రజల నమ్మకాన్ని కాలరాసే చారిత్రక మోసం అవుతుందని మన్మోహన్ ఘాటుగా విమర్శించారు. జూన్ 15న భారత సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరగ్గా... మన్మోహన్ తొలిసారిగా దీనిపై స్పందించారు.

ఇప్పుడు మనం చారిత్రక చౌరస్తాలో ఉన్నాం. మన ప్రభుత్వ నిర్మయాలు, చర్యల్ని బట్టీ... మనల్ని భవిష్యత్ తరాలు స్వీకరిస్తాయి. ప్రజాస్వామ్యంలో... ప్రధాని కార్యాలయంపైనే బాధ్యత ఉంటుంది. దేశ భద్రత, వ్యూహాత్మక అంశాలు, సరిహద్దు విషయాలపై ప్రధాని ఏదైనా మాట్లాడేటప్పుడు... ప్రతిసారీ మైండ్‌తో ఆలోచించి మాట్లాడాలి"
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
.


ప్రధాని నరేంద్రమోదీ... భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చేశారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం అఖిలపక్ష సమావేశం తర్వాత విమర్శలు రావడంతో... శనివారం ప్రధాని కార్యాలయం (PMO) ఓ ప్రకటన చేసింది. ప్రధాని వాఖ్యల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని అంది. మన సైనిక దళాల ధైర్య సాహసాల వల్ల... భారత భూభాగంలో చైనా సైనికులు లేరనేది ప్రధాని మోదీ వ్యాఖ్యల ఉద్దేశం అన్న PMO... చైనా సైనికులు... సరిహద్దుల్లో నిర్మాణాలు నిర్మించకుండా... వాస్తవాధీన రేఖ గుండా భారత్‌లోకి చొరబడకుండా... గత సోమవారం రాత్రి (జూన్ 15)... 16వ బీహార్ రెజిమెంట్... ప్రాణాలకు తెగించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఏప్రిల్ నుంచి చాలాసార్లు భారత భూభాగాల్లోకి చొరబడుతూ చైనా... మన దేశానికి చెందిన గాల్వాన్ లోయ, ప్యాంగాంగ్ సో సరస్సును తనవిగా చెప్పుకుంటోందన్న మన్మోహన్ సింగ్... మన భూభాగాల విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండకూడదన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు చైనాకి అనుకూలంగా మారకూడదన్న మన్మోహన్ సింగ్... కేంద్రంలోని అన్ని విభాగాలూ కలిసి... ఈ సమస్యకు పరిష్కారం చూడాలన్నారు.

తప్పుడు సమాచారం ఇవ్వడం దౌత్యానికి ప్రత్యామ్నాయం అనిపించుకోదు లేదా అది సమర్థ నాయకత్వం అవ్వదు. ఈ సమయంలో మనమంతా ఒకే తాటిపై నిలవాలి. మనకు వచ్చే ఆపదను సమర్థంగా ఎదుర్కోవాలి. తప్పుడు ప్రకటనల ద్వారా... నిజాన్ని కప్పిపుచ్చలేం... అని మన్మోహన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
First published: June 22, 2020, 11:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading