హోమ్ /వార్తలు /ఇండో చైనా /

Modi - Xi Jinping: ఈనెల 10న ప్రధాని మోదీ, జిన్ పింగ్ ఫేస్ టు ఫేస్

Modi - Xi Jinping: ఈనెల 10న ప్రధాని మోదీ, జిన్ పింగ్ ఫేస్ టు ఫేస్

మోదీతో జిన్‌పింగ్ (ఫైల్ ఫొటో)

మోదీతో జిన్‌పింగ్ (ఫైల్ ఫొటో)

నవంబర్ 10న షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ వర్చువల్‌గా నిర్వహించే వార్షిక సమావేశంలో వారిద్దరు ఫేస్ టు ఫేస్ ఎదురుపడనున్నారు.

Modi -Jinping Meeting: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముఖాముఖి ఎదురుపడనున్నారు. నవంబర్ 10న షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ వర్చువల్‌గా నిర్వహించే వార్షిక సమావేశంలో వారిద్దరు ఫేస్ టు ఫేస్ ఎదురుపడనున్నారు. లద్దాక్‌లో భారత్, చైనా బలగాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వారిద్దరూ ముఖాముఖి ఎదురుపడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశానికి భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తారని విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. ‘నవంబర్ 10న షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ ఆన్ లైన్ ద్వారా నిర్వహించే 20వ సమావేశానికి హాజరయ్యే భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తారు. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షత వహిస్తారు.’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. చైనా బృందానికి జిన్‌పింగ్ నాయకత్వం వహించనున్నట్టు తెలిసింది. షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్‌తో మరింత కలసి పనిచేయాలని భారత్ భావిస్తోంది. ఇందులో 8 దేశాలు ఉన్నాయి. ఈ 8 దేశాల్లోనే ప్రపంచంలోని 42 శాత జనాభా ఉంది. అలాగే, ప్రపంచ జీడీపీలో 20 శాతం ఈ దేశాలు కలిగిఉన్నాయి.

గత ఆరు నెలల నుంచి జమ్మూకాశ్మీర్‌లోని లద్దాక్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. చైనా సైన్యం దుందుడుకు చర్యలను భారత్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. భారత్ చైనా మధ్య నెలకొంటున్న ఉద్రిక్తతలను సడలించేందుకు ఇరు దేశాల మధ్య కమాండర్ స్థాయి చర్చల్లో భాగంగా నిన్న ఎనిమిదోసారి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సారి తూర్పు లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలోని చుషూల్ వద్ద జరిగాయి. భారత బృందానికి లెప్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వం వహించారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినట్టు అధికారులు తెలిపారు. తూర్పు లద్దాక్‌ లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనిక దళాలను వెనక్కి తీసుకోవడం, సైనికుల ఉపసంహరణపై రోడ్ మ్యాప్ ఖరారు చేయడం వంటి వాటిపై ప్రధానంగా చర్చలు జరిగాయి.

నిన్న భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రావత్ మాట్లాడుతూ, సరిహద్దుల్లో ఉద్రిక్తత పరస్థితి నెలకొన్నాయని, కాబట్టి యుద్ధానికి దారితీసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని తెలిపారు. తూర్పు లద్దాక్ వాస్తవాధీన రేఖ వద్ద చైనా దుస్సాహసానికి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా బలగాలను భారత్ సమర్థంగా ఎదుర్కొంటుండడంతో చైనాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్నారు. చైనా, పాక్ కలిసి ప్రాంతీయ ఉద్రిక్తతకు పాల్పడుతున్నాయని రావత్ తెలిపారు.

మరోవైపు భద్రతా పరమైన అంశాల కారణంగా చైనాకు చెందిన 170కి పైగా మొబైల్ యాప్స్‌ను భారత్ నిషేధించింది. టిక్‌టాక్, హలో, పబ్ జీ సహా పలు యాప్‌లను కేంద్రం నిషేధించింది. చైనాతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశ సార్వభౌమాధికారం సమగ్రత, దేశ యొక్క రక్షణ, భద్రత దృష్ట్యా వీటిపై నిషేధిస్తున్నట్లు హోంశాఖ పేర్కొంది. మొదట 59 యాప్స్‌ను బ్యాన్ చేసిన భారత్, ఆ తర్వాత మరో 118 యాప్స్‌‌పై నిషేధం విధించింది.

First published:

Tags: China App Ban, India-China, Indo China Tension, Pm modi, Xi Jinping

ఉత్తమ కథలు