బార్డర్‌లో ఎగిరెగిరిపడుతున్న డ్రాగన్..ప్రధాని కీలక సమీక్ష

త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఆ భేటీ ముగిసిన వెంటనే ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

news18-telugu
Updated: May 26, 2020, 7:48 PM IST
బార్డర్‌లో ఎగిరెగిరిపడుతున్న డ్రాగన్..ప్రధాని కీలక సమీక్ష
ప్రధాని మోదీ
  • Share this:
ఇండియా, చైనా బార్డర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల ప్రధాన అధికారి (CDS) బిపిన్ రావత్‌లో కీలక చర్చలు జరిపారు. అంతేకాదు విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌తో మంతనాలు జరిపారు మోదీ. లద్దాఖ్‌తో ఇరు దేశ సైన్యాల మధ్య నెలకొన్న ఉద్రిక్తలపై చర్చించారు. అంతకుముందు త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఆ భేటీ ముగిసిన వెంటనే ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

సిక్కిం, లద్దాఖ్‌లో కొన్ని రోజులుగా భారత్, చైనా దళాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి దిగారు. అంతేకాదు లద్దాఖ్ సమీపంలో చైనా ఎయిర్‌బేస్‌ను విస్తరించినట్లు శాటిలైట్ ఫొటోలు బయడ్డాయి. ఈ క్రమంలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీ కీలక ప్రాధాన్యత సంతరించుకుంది.

మే 5న తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాకి చెందిన 250 మంది సైనికులు కొట్టుకున్నారు. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ గొడవలో రెండువైపులా 100 సైనికులు గాయపడ్డారు. ఆ తర్వాతి రోజు రెండు వైపులా కమాండర్లు మాట్లాడుకోవడం ద్వారా మేటర్ సెటిలైంది. 4 రోజుల తర్వాత ఉత్తర సిక్కింలో నాథులా పాస్ వద్ద మరోసారి గొడవ జరిగింది. ఆ ఘటనలో రెండువైపులా 10 మంది సైనికులు గాయపడ్డారు. తాజాగా చైనా తూర్పు లఢక్ దగ్గర వాస్తవాధీన రేఖ వెంట 5000 బలగాల్ని వేర్వేరు లొకేషన్లలో మోహరించింది. పాంగ్యాంగ్ సరస్సు, గల్వాన్ లోయ సమీపంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టింది. ఇది గమనించిన ఇండియా కూడా భారీగా మోహరించింది. ఇలా పోటా పోటీగా సైన్యాలను మోహరించడంతో సరిహద్దులలో అసలేం జరుగుతోందనని అంతటా ఉత్కంఠ నెలకొంది.

ఐతే కరోనా విషయంలో అన్ని దేశాలు చైనాను దోషిగా చెబుతున్నాయి. చైనా వల్లే ప్రపంచమంతటా వైరస్ విస్తరించిందని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనాను చైనీస్ వైరస్ అని చాలా సందర్భాల్లో సంభోదించారు. ఈ నేపథ్యంలో భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు పెంచడం ద్వారా.. కరోనా విషయంలో తనపై వస్తున్న విమర్శల దాడిని నుంచి ప్రపంచం దృష్టిమరల్చాలని చైనా భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
First published: May 26, 2020, 7:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading