India-China Tension: ముసురుకున్న యుద్ధ మేఘాలు...ఇండియాలోని చైనీయులకు రెడ్ అలర్ట్...

భారత్‌-చైనాల మధ్య లదాఖ్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో చైనీయులందరినీ ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూండటం గమనార్హం.

news18-telugu
Updated: May 29, 2020, 1:19 PM IST
India-China Tension: ముసురుకున్న యుద్ధ మేఘాలు...ఇండియాలోని చైనీయులకు రెడ్ అలర్ట్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న చైనీయులందరినీ ఖాళీ చేసి స్వదేశానికి తరలించాలని చైనా నిర్ణయించింది. భారత్‌-చైనాల మధ్య లదాఖ్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో చైనీయులందరినీ ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూండటం గమనార్హం. చైనా తన దేశస్థులను భారత్ నుంచి తరలించాలని నిర్ణయించుకోవడం విశేషం. కరోనా కాలంలో భారత్‌లో ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు కష్టాలు ఎదుర్కొంటున్నారని స్వదేశానికి వెళ్లాలని అనుకునేవారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని చైనా అధికార వెబ్‌సైట్‌లో సోమవారం ఒక ప్రకటన వెలువడింది. స్వదేశానికి వెశ్లాలని నిర్ణయించుకున్న వారందరూ అక్కడ క్వారంటైన్, ఇతర వైద్యపరమైన ఏర్పాట్లకు అంగీకరించాలని ఈ నోటీసులో స్పష్టం చేశారు.

విమానం ఎక్కేలోపు శరీర ఉష్ణోగ్రత 37.3 డిగ్రీ సెల్సియస్‌ కంటే ఎక్కువైనా, ఇతర లక్షణాలేవైనా ఉన్న వారికి అనుమతి నిరాకరిస్తామని నోటీసులో స్పష్టం చేశారు. మాండరిన్‌ భాషలో ఉన్న ఆ ప్రకటన ప్రకారం కరోనా వైరస్‌కు చికిత్స పొందిన వారు లేదా గత 14 రోజుల్లో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక విమానాల్లో చోటు లేదు. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఉండిపోయిన చైనీయులను కూడా ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ ప్రకటనలో సూచనప్రాయంగా తెలిపారు.
First published: May 29, 2020, 1:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading