PICTURE OF DEAD CHINESE SOLDIERS GRAVE GIVES VIRAL FIRST EVIDENCE OF PLA LOSSES IN GALWAN VALLEY
గల్వాన్ లోయలో మరణించిన చైనా జవాను సమాధి ఫోటో వైరల్!
గల్వాన్ లోయలో మరణించిన చైనా ఆర్మీ జవాను సమాధి
India-China Tensions: సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఓ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA)కి చెందిన 19 ఏళ్ల జవానుకు సంబంధించిన సమాధి పలకం ఫోటో ఇది.
సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఓ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA)కి చెందిన 19 ఏళ్ల జవానుకు సంబంధించిన సమాధి పలకం ఫోటో ఇది. గల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జూన్ 15న రాత్రి జరిగిన ఘర్షణల్లో మరణించిన చైనా జవానుకు సంబంధించి ఫోటోగా ప్రచారం జరుగుతోంది. గల్వాన్ లోయలో జరిగిన నాటి ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగినా..ఇప్పటి వరకు ఆ దేశం ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నాటి ఘటనలో 35 మంది చైనా ఆర్మీ జవాన్లు మృతి చెందినట్లు అమెరికా ఇంటెలిజన్స్ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పుడు చైనా ఆర్మీ జవాను సమాధి పలకం ఫోటో బయటకు రావడంతో...చైనా వైపు కూడా ప్రాణనష్టం జరిగినట్లు నిర్థారణ అవుతోంది. ఈ సమాధి పలకంపై చైనా జవాను చెన్ జింగ్రాంగ్ పేరును రాశారు. 2020 జూన్లో భారత సరిహద్దులో దేశం కోసం ప్రాణాలు అర్పించినట్లు అందులో పేర్కొన్నారు. 2001 డిసెంబరులో జన్మించిన చెన్ జింగ్రాంగ్ 19 ఏళ్ల వయస్సులో మరణించాడు.
This photo of a tombstone of a PLA soldier who died in the clash in Ladakh has been making the rounds since yesterday. I checked with a source and some users on Chinese social media have said that they shouldn't share this picture as it is related to 'national security'. pic.twitter.com/AOR8uny1GT
చైనాకు చెందిన సోషల్ మీడియా వేదిక వైబోలోనే ఈ ఫోటోలు ముందుగా వైరల్ అయ్యాయి. వెంటనే ఈ ఫోటోను భారతీయులు ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సమాధి ఫోటోపై చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటు భారత ప్రభుత్వం కూడా ఈ వైరల్ ఫోటోపై ఇప్పటి వరకు స్పందించలేదు.
A picture is circulating on Weibo, showing the tombstone of a 19 year old Chinese soldier who died in the “China-India Border Defense Struggle” in June 2020. He was from Fujian Province. https://t.co/Brrw5o7h4z
ఈ సమాధిపైన ఫోటోను ఏర్పాటు చేసిన మరో చైనా ఆర్మీ జవానును ఆ దేశ కమ్యూనిస్టు ప్రభుత్వం జైలుకు పంపినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.