చైనాకు చెంప దెబ్బ... వందేమాతరం పాడిన పాకిస్థాన్ ప్రజలు...

ఎక్కడైనా సరే... పాలకులు స్వార్థంతో ఆలోచిస్తారుగానీ... ప్రజలు అలా చెయ్యరు. వాళ్లలో నీతి, నిజాయితీ ఉంటుంది. ఆ విషయాన్ని పాకిస్థాన్ ప్రజలు నిరూపించారు. చైనాకి చెక్ పెట్టారు.


Updated: July 14, 2020, 1:45 PM IST
చైనాకు చెంప దెబ్బ... వందేమాతరం పాడిన పాకిస్థాన్ ప్రజలు...
చైనాకు చెంప దెబ్బ... వందేమాతరం పాడిన పాకిస్థాన్ ప్రజలు... (credit - twitter)
  • Share this:


పాకిస్థాన్ ప్రజలు... భారత జాతీయ గీతాలను పాడిన సందర్భాలు చాలా తక్కువ. కానీ... ఆదివారం అది ఆవిష్కృతమైంది. లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం ముందు వందల మంది భారతీయులు ఒక్కటై చైనాకి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఆ సమయంలో... కొంతమంది పాకిస్థానీయులు కూడా భారతీయులతో చేతులు కలిపారు. చైనాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందేమాతర గీతం ఆలపించారు. బాయ్‌కాట్ చైనా అంటూ నినదించారు. పాకిస్థాన్ ప్రభుత్వం... చైనాతో వంత పాడటం మానుకోవాలని పాకిస్థాన్ మానవ హక్కుల పోరాటకర్త అరిఫ్ అజాకియా నినాదాలు చేశారు. తన జీవితంలో తాను మొదటిసారి వందేమాతరం పాడానని ఆయన అన్నారు.పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌‌లో పుట్టి లండన్‌లో ఉంటున్న అంజాద్ ఆయుబ్ మిర్జా, మరికొంత మంది కరాచీకి చెందినవారు, కొంత మంది ఇరాన్ ప్రజలు కూడా చైనా తీరుపై లండన్ ఏంబసీ ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ దేశ వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటోందని వాళ్లు ఫైర్ అయ్యారు. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ పేరుతో... గిల్గిత్-బలిస్థాన్ మధ్య చైనా చిచ్చు పెడుతోందని వారు మండిపడ్డారు. చైనా చెప్పినట్లు వింటూ పాక్ ప్రభుత్వం పీఓకేలో ప్రజలపై అరాచకాలు చేస్తోందని ఆయుబ్ మిర్జా ఆరోపించారు.
చైనా తీరును తప్పుపడుతూ... అమెరికా, కెనడా సహా చాలా దేశాల్లో భారతీయులు ఆందోళనలు చేస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అత్యాశ పనికిరాదని హెచ్చరిస్తున్నారు. లండన్ వీధుల్లో కూడా చైనాపై వ్యతిరేకత పెరుగుతోంది. "ఫ్రీ టిబెట్, ఫ్రీ హాంకాంగ్, ఫ్రీ ఉయ్‌ఘర్స్" అనే ఫొటో ఒకటి శనివారం రాత్రి అక్కడ చైనా రాయబార కార్యాలయంపై వేలాడుతూ కనిపించింది.


చైనాకి చెందిన 59 యాప్స్ నిషేధించడం ద్వారా ఇప్పటికే చైనాకి భారత్ చెక్ పెట్టింది. మరిన్ని చర్యలు కూడా తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో తోక ముడిచిన డ్రాగన్... లఢక్‌లో సరిహద్దు ప్రాంతాల నుంచి వెనక్కి మళ్లింది. గాల్వాన్ లోయలో ఆయుధాల్ని, గుడారాల్ని కూడా వెనక్కి తీసుకెళ్లింది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కూడా చైనాకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక కరోనా వైరస్ కారణంగా... చాలా దేశాలు చైనాపై గుర్రుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్థానీయులు వందేమాతరం పాడటం చైనాకి చెంపదెబ్బలా మారింది.
Published by: Krishna Kumar N
First published: July 14, 2020, 1:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading