కరోనా వైరస్, చైనాతో సరిహద్దు వివాదంతో చైనా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో చైనా గురించి భారతీయుల్లో ఉన్న అభిప్రాయాలు తెలుసుకునేందుకు నెట్ వర్క్ 18 ప్రయత్నించింది. నెట్ వర్క్ 18లోని న్యూస్ 18, మనీ కంట్రోల్, సీఎన్‌బీసీ టీవీ18, ఫస్ట్ పోస్ట్ లాంటి వెబ్ సైట్లలో సర్వే నిర్వహించింది. 13 భాషలకు చెందిన 16 వెబ్ సైట్లు, వందకు పైగా సోషల్ మీడియా అకౌంట్లో నిర్వహిచిన ఈ సర్వేలో సుమారు 31వేల మంది పాల్గొన్నారు. నెట్ వర్క్ 18 ఇచ్చిన 21 ప్రశ్నలకు దేశం నలుమూలల నుంచి తమ అభిప్రాయాలు తెలిపారు.
చైనాను మీరు ఎలా చూస్తారు?
అనుకూలంగా - 5 %
అననుకూలంగా - 84.3 %
డోంట్ కేర్ - 10.8 %
చైనా మీద మీ అభిప్రాయం ఎప్పుడు మారింది?
తాజాగా - 15 %
గత కొన్ని సంవత్సరాల్లో - 24 %
ఎప్పుడూ ఇదే అభిప్రాయం - 61 %
గత కొన్ని వారాల్లో చైనా మీద మీ అభిప్రాయం ఎలా మారింది?
క్షీణించింది - 66.9 %
మెరుగైంది - 3.4 %
ఏం మారలేదు - 29.7 %
చైనా యాక్షన్, భారత్ రియాక్షన్‌ను మీరు ఎలా చూస్తారు?
శత్రుదేశంలా జవాబివ్వాలి - 61.4 %
అది కేవలం ప్రదర్శన - 26.5 %
ఎలాంటి అభిప్రాయం లేదు - 12.1 %
భారత్‌లోకి చైనా చొరబాటు ప్రయత్నం, రెండు దేశాల ఆర్మీ ఘర్షణ గురించి తెలుసా?
తెలుసు - 90.8 %
తెలియదు - 9.2 %
ఈ అంశంపై మిటలరీ వివాదం మీద మీరు ఆందోళన చెందుతున్నారా?
ఔను - 69.8 %
కాదు - 30.2 %
చైనా తీరుకు మీరు 1 నుంచి 5 వరకు ఎంత రేటింగ్ ఇస్తారు?
అస్సలు స్నేహపూర్వకం కాదు - 51.8%
స్నేహపూర్వకం కాదు - 27.8%
స్నేహం కాదు, వ్యతిరేకం కాదు - 17.9%
స్నేహపూర్వకం - 1.5%
అత్యంత స్నేహపూర్వకం - 0.9%
చైనా విషయంలో మీరు వ్యతిరేకించే అంశం?
అస్సలు నమ్మదగినది కాదు - 24.2%
స్నేహపూర్వకమైనది కాదు - 3.6%
పాకిస్తాన్‌కు మద్దతిస్తూ ఉగ్రవాదులకు సహకారం అందిస్తుంది - 21.8%
పై వన్నీ - 44.7%
నేను చైనాను వ్యతిరేకించను - 5.7%
పాకిస్తాన్‌కు చైనా ప్రధాన మద్దతుదారు అనే విషయం మీకు తెలుసా?
తెలుసు - 92.7%
తెలియదు - 7.3%
చైనాతో స్నేహపూర్వక వైఖరిపై భారత్ పునరాలోచించాలనుకుంటున్నారా?
ఔను - 53.5%
కాదు - 46.5%
మరింత చైనా పెట్టుబడులను భారత్‌లోకి మీరు ఆహ్వానిస్తారా?
ఔను - 12.8%
కాదు - 87.2%
చైనా ఉత్పత్తల వినియోగంపై మీరు పునరాలోచిస్తారా?
కచ్చితంగా. చైనా వస్తువులేవీ కొనను - 72.1%
చైనా ఉత్పత్తులను కొనడం తగ్గిస్తా - 23.5%
అవి చవక. భవిష్యత్తులో కూడా కొంటా - 4.4%
కొన్ని గుర్తించిన చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా?
ఔను - 90.6%
కాదు - 9.4%
భారత్ త్వరలో 5జీ లాంచ్ చేయబోతోంది. చైనాకు చెందిన హువాయ్ లాంటి కంపెనీలు భారత్‌లో 5జీ మౌలిక సదుపాయాలు కల్పించడానికి అనుమతించాలంటారా?
ఔను - 12.1%
కాదు - 87.9%
కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందన్న విషయం మీకు తెలుసా?
ఔను - 96.6%
కాదు - 3.4%
కరోనా వైరస్ విషయంలో చైనా నిజాయితీగా ఉండడం లేదన్న ఆరోపణలతో మీరు ఏకీభవిస్తారా?
ఔను - 93.9%
కాదు - 6.1%
చైనాను వరల్డ్ పవర్‌గా మీరు అంగీకరిస్తారా?
అది ఒక బాధ్యతతో కూడిన అధికారం - 4.9%
చైనాది ఓ బాధ్యతారాహిత్యమైన అధికారం - 77.4%
నాకు ఎలాంటి అభిప్రాయం లేదు - 17.7%
టిబెట్, జిన్ జియాంగ్, మంగోలియా అంతర్భాగం స్వాతంత్ర్య ఆకాంక్షలకు భారత్ మద్దతివ్వాలంటారా?
ఔను - 57.9%
కాదు - 15.8%
చెప్పలేం - 26.3%
భారత్ తైవాన్ను ఓ ప్రత్యేక దేశంగా గుర్తించాలంటారా?
ఔను - 60.5%
కాదు - 11.3%
చెప్పలేం - 28.2%
చైనా, వరల్డ్ పవర్స్ మధ్య మిలటరీ వివాదం ఏర్పడితే భారత్ ఎటువైపు ఉండాలి?
వరల్డ్ పవర్‌కు మద్దతివ్వాలి - 73.5%
తటస్థంగా ఉండాలి - 25.1%
చైనాకు మద్దతివ్వాలి - 1.3%
మీరు ఎవరికి మద్దతిస్తారు?
డొనాల్డ్ ట్రంప్ - 92.1%
జి జిన్ పింగ్ - 7.9%
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India-China, Network18, News18