#News18ChinaSentimeter | బాయ్‌కాట్ చైనాకు భారీ సపోర్ట్.. సర్వేలో షాకింగ్ రిపోర్ట్...

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న చైనా విషయంలో ఇండియన్స్ వైఖరి ఎలా ఉందనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించింది న్యూస్ 18.

  • Share this:
    భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న చైనా విషయంలో ఇండియన్స్ వైఖరి ఎలా ఉందనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించింది న్యూస్ 18. నెట్ వర్క్ 18లోని న్యూస్ 18, మనీ కంట్రోల్, సీఎన్‌బీసీ టీవీ18, ఫస్ట్ పోస్ట్ లాంటి వెబ్ సైట్లలో సర్వే నిర్వహించింది. 13 భాషలకు చెందిన 16 వెబ్ సైట్లు, వందకు పైగా సోషల్ మీడియా అకౌంట్లో నిర్వహిచిన ఈ సర్వేలో సుమారు 31వేల మంది పాల్గొన్నారు. నెట్ వర్క్ 18 ఇచ్చిన 21 ప్రశ్నలకు దేశం నలుమూలల నుంచి తమ అభిప్రాయాలు తెలిపారు. అందులో చైనా ఉత్పత్తుల కొనుగోలు, చైనా నుంచి భారత్‌లో పెట్టుబడులను ఆహ్వానిస్తారా? అనే అంశంపై నెటిజన్లు తమ అభిప్రాయాలు తెలిపారు.

    మరింత చైనా పెట్టుబడులను భారత్‌లోకి మీరు ఆహ్వానిస్తారా?
    ఔను - 12.8%
    కాదు - 87.2%

    చైనా ఉత్పత్తల వినియోగంపై మీరు పునరాలోచిస్తారా?
    కచ్చితంగా. చైనా వస్తువులేవీ కొనను - 72.1%
    చైనా ఉత్పత్తులను కొనడం తగ్గిస్తా - 23.5%
    అవి చవక. భవిష్యత్తులో కూడా కొంటా - 4.4%

    కొన్ని గుర్తించిన చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా?
    ఔను - 90.6%
    కాదు - 9.4%

    భారత్ త్వరలో 5జీ లాంచ్ చేయబోతోంది. చైనాకు చెందిన హువాయ్ లాంటి కంపెనీలు భారత్‌లో 5జీ మౌలిక సదుపాయాలు కల్పించడానికి అనుమతించాలంటారా?
    ఔను - 12.1%
    కాదు - 87.9%
    Published by:Ashok Kumar Bonepalli
    First published: