భారత్, చైనాల మధ్య జరుగుతున్న ఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో నెట్ వర్క్ 18 ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. News18PublicSentimeter పేరుతో నెట్ వర్క్ 18 నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అందులో చైనీస్ ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలనేది ప్రధానం. చైనీస్ వస్తువులను బహిష్కరిస్తామని 70.13 శాతం మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అందు వల్ల తమ జేబుకు కొంచెం ఖర్చు పడుతుందని తెలిసినా కూడా వారు చైనీస్ వస్తువులను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు. వీలున్నంత వరకు బాయ్ కాట్ చేస్తామని 23.49 శాతం మంది అభిప్రాయపడ్డారు. బోర్డర్‌కి, బాయ్ కాట్‌కి సంబంధం లేదని 6.38 శాతం మంది అన్నారు. అలాగే, నటులు, క్రికెటర్లు చైనీస్ బ్రాండ్లకు ప్రమోషన్లు చేయడం మానేయాలని నెటిజన్లు కోరారు. 78.75 శాతం మంది నెటిజన్లు నటులు, క్రికెటర్లు చైనీస్ బ్రాండ్లకు అంబాసిడర్లుగా మానేయాలన్నారు. అవసరం లేదని కేవలం 3.43 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు.
భారతీయ నటులు, క్రికెటర్లు చైనీస్ బ్రాండ్లను ప్రమోట్ చేయడం ఆపాలా?
ఔను. వారి నుంచి కనీసం ఆశించేది అదే : 78.75%
కాదు : 3.43 %
నేనేం తీర్పు చెప్పను. వాళ్లకు వాళ్లు దేశం మొదట అని గ్రహిస్తే బావుంటుంది.: 17.82%
దీపికా పదుకొణె, రణ్ బీర్ కపూర్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్ వంటి నటులు, విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లు చైనీస్ బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉన్నారు. వాటి ద్వారా భారీ ఎత్తున సంపాదనను ఆర్జిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.