భారత్, చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న ఘర్షణ వాతావరణ పరిస్థితుల్లో నెట్ వర్క్ 18 ఓ సర్వే నిర్వహించింది. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో నిర్వహించిన ఈ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. చైనీస్ ఉత్పత్తులను బాయ్ కాట్ చేస్తారా? చైనీస్ యాప్స్‌ను వదిలేస్తారా? లాంటి ప్రశ్నలతో పాటు చైనీస్ ఫుడ్‌కు సంబంధించి కూడా ప్రశ్నకు నెటిజన్లు తెలివిగా సమాధానం ఇచ్చారు. భారత్‌లో చైనీస్ ఫుడ్ బాగా పాపులర్. ఈసారి చైనీస్ ఫుడ్ తినేటప్పుడు మీరు ఆలోచిస్తారా? అనే ప్రశ్నకు స్పందించిన నెటిజన్లలో 30.55 శాతం మంది... భారత్, చైనా ఘర్షణకి, ఫుడ్‌కి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇక చైనీస్ ఫుడ్ తినబోమని అత్యధికంగా 42.95 శాతం మంది స్పష్టం చేశారు. కానీ, ఇండియన్ చైనీస్‌కి కొత్త పేరు పెట్టడానికి ఆలోచిద్దామని 26.50 శాతం మంది అభిప్రాయపడ్డారు.
భారత్‌లో చైనీస్ ఫుడ్ బాగా పాపులర్. ఈసారి చైనీస్ ఫుడ్ తినేటప్పుడు మీరు ఆలోచిస్తారా?
దీంట్లో ఫుడ్‌కి ఏం సంబంధం? : 30.55%
ఇండియన్ చైనీస్‌కి కొత్త పేరు పెట్టడానికి ఆలోచిద్దాం : 26.50%
ఇక మీద నో చైనీస్ ఫుడ్ : 42.95%
మీ పర్సు మీద భారం పడుతుందని తెలిసినా మీరు చైనా వస్తువులు బాయ్ కాట్ చేస్తారా?
కచ్చితంగా, డబ్బులతో సంబంధం లేదు. : 70.13 %
వీలున్నంత వరకు బాయ్ కాట్ చేస్తా: 23.49 %
లేదు. బోర్డర్ గొడవకి, దీనికి సంబంధం లేదు: 6.38 %
చైనా యాప్స్, చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వాడడం మానేస్తారా?
ఔను. మా కుటుంబం, ఫ్రెండ్స్‌ను కూడా అదే చేయమని చెబుతా: 90.72%
కాదు. నాకు టిక్ టాక్ ఇష్టం : 0.99 %
చైనీస్ యాప్స్ వాడతా. కానీ నా డేటా భారత్ దాటకూడదు: 2.35%
ఎందుకు? ఇండియా నుంచి ప్రత్యామ్నాయ యాప్స్ లేవు: 5.94 %
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India-China, Indo China Tension, Network18, News18