Home /News /india-china /

NEWS18 PUBLIC SENTIMETER NEWS18 PUBLIC SENTIMETER HERE IS THE PUBLIC OPINION ON MODI LEADERSHIP IN CORONA TIME AND CHINA FIGHT SK

News18 Public Sentimeter: ఇటు కరోనా, అటు చైనా.. మోదీ పాలనపై ప్రజాభిప్రాయం ఇదే

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

కరోనా సంక్షోభం, చైనాతో వివాదం వంటి సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని మీరు విశ్వసిస్తున్నారా? అన్న ప్రశ్నకు 56 శాతం మంది సంపూర్ణ విశ్వాసముందని సమాధానం చెప్పారు.

    ప్రస్తుతం మనదేశం ఒకే సమయంలో రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకటి కరోనా ప్రభావంతో ఏర్పడిన సంక్షోభం, రెండోది చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం..! ఇలాంటి క్లిష్ట పరిస్థితులను భారత ప్రధాని ఎలా ఎదుర్కొంటున్నారు? ఆయన పనితీరు ఎలా ఉంది? కరోనాను కట్టడి చేయడంలో విజయం సాధించారా? చైనాకు గట్టిగా బుద్ధి చెప్పగలిగారా? ఈ రెండు అంశాల్లో ఆయన ఎంత వరకు సక్సెస్ అయ్యారు? ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా? అసలు ప్రధాని మోదీ పాలనపై ఎంత మందికి విశ్వాసముంది? అనే అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు న్యూస్ 18 సర్వే చేపట్టింది. ఇందులో ఆసక్తికర విషయాలు తెలిశాయి.

    కరోనా సంక్షోభం, చైనాతో వివాదం వంటి సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని మీరు విశ్వసిస్తున్నారా? అన్న ప్రశ్నకు 56 శాతం మంది సంపూర్ణ విశ్వాసముందని సమాధానం చెప్పారు. మరో 28శాతం మంది కొంత వరకు నమ్మకముందని తెలిపారు. అంతగా విశ్వాసం లేదని 9 శాతం, మోదీ పాలనపై అస్సలు నమ్మకం లేదని మరో 7 మంది అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే.. 84 శాతం మంది 'మోదీ పాలన పట్ల విశ్వాసం ఉంది', 'అవును' అనే సమాధానం చెప్పారు. 16 శాతం మంది మాత్రం కాదు అని ఆన్సర్ ఇచ్చారు.
    News18PublicSentimeter

    కరోనా వైరస్, సరిహద్దు వివాదం తర్వాత చైనా పట్ల భారత ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారన్న దానిపై పలు అంశాల వారీగా News18 చేపట్టింది. Piplsay సంస్థతో కలిసి ఆగస్టు 3 నుంచి 10 మధ్య ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 10వేల మంది ఇందులో పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 60శాతం మంది పురుషులు, 40శాతం మంది స్త్రీలు పాల్గొన్నారు. వీరిలో 18-25 వయసు ఉన్నవారు 33శాతం, 26-30 వయసు కలిగిన వారు 18శాతం, 31-35 వయసున్న వారు 15శాతం మంది, 36-40 ఏళ్ల వారు 15శాతం, 41-45 ఏళ్ల వారు 6శాతం, 45 ఏళ్లు పైబడిన వారు 12 శాతం మంది ఉన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Corona virus, Coronavirus, Covid-19, Indo China Tension, PM Narendra Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు