హోమ్ /వార్తలు /ఇండో చైనా /

#News18PublicSentimeter | ఖర్చైనా పర్లేదు.. బాయ్ కాట్ చైనా... సర్వేలో ఆసక్తికర అంశాలు..

#News18PublicSentimeter | ఖర్చైనా పర్లేదు.. బాయ్ కాట్ చైనా... సర్వేలో ఆసక్తికర అంశాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

#News18PublicSentimeter పేరుతో నెట్ వర్క్ 18 వివిధ భాషల్లో నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

ప్రస్తుతం భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్‌లోని నెటిజన్లలో చైనా మీద, ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రబలంగా ఉన్న బాయ్ కాట్ చైనా అనే అంశంతో పాటు మరికొన్ని విషయాల్లో నెట్ వర్క్ 18 సర్వే నిర్వహించింది. #News18PublicSentimeter పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

మీ పర్సు మీద భారం పడుతుందని తెలిసినా మీరు చైనా వస్తువులు బాయ్ కాట్ చేస్తారా?

కచ్చితంగా, డబ్బులతో సంబంధం లేదు. : 70.13 %

వీలున్నంత వరకు బాయ్ కాట్ చేస్తా: 23.49 %

లేదు. బోర్డర్ గొడవకి, దీనికి సంబంధం లేదు: 6.38 %

చైనా యాప్స్, చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వాడడం మానేస్తారా?

ఔను. మా కుటుంబం, ఫ్రెండ్స్‌ను కూడా అదే చేయమని చెబుతా: 90.72%

కాదు. నాకు టిక్ టాక్ ఇష్టం : 0.99 %

చైనీస్ యాప్స్ వాడతా. కానీ నా డేటా భారత్ దాటకూడదు: 2.35%

ఎందుకు? ఇండియా నుంచి ప్రత్యామ్నాయ యాప్స్ లేవు: 5.94 %

నమ్మకద్రోహం, 20 మంది భారత సైనికులను చంపిన తర్వాత కూడా మీరు చైనాను నమ్ముతారా?

ఎప్పుడూ నమ్మకద్రోహం చేస్తూనే ఉంది: 44.00 %

ఎప్పుడూ నమ్మను : 47.83%

భారత్, చైనా ఇరుగుపొరుగు దేశాలు. పరస్పరం డీల్ చేయాలి: 8.17%

భారత్‌లో చైనీస్ ఫుడ్ బాగా పాపులర్. ఈసారి చైనీస్ ఫుడ్ తినేటప్పుడు మీరు ఆలోచిస్తారా?

దీంట్లో ఫుడ్‌కి ఏం సంబంధం? : 30.55%

ఇండియన్ చైనీస్‌కి కొత్త పేరు పెట్టడానికి ఆలోచిద్దాం : 26.50%

ఇక మీద నో చైనీస్ ఫుడ్ : 42.95%

భారతీయ నటులు, క్రికెటర్లు చైనీస్ బ్రాండ్లను ప్రమోట్ చేయడం ఆపాలా?

ఔను. వారి నుంచి కనీసం ఆశించేది అదే : 78.75%

కాదు : 3.43 %

నేనేం తీర్పు చెప్పను. వాళ్లకు వాళ్లు దేశం మొదట అని గ్రహిస్తే బావుంటుంది.: 17.82%

ఈ సమయంలో ఏ దేశం భారత్‌కు ఎక్కువ ప్రమాదకారి?

చైనా : 91.69%

పాకిస్తాన్ : 8.31%

ఈ సమయంలో చైనాకు భారత్ ఎలా బదులివ్వాలనుకుంటున్నారు?

సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి : 36.36%

చైనాకు మార్కెట్‌గా మారడానికి భారత్ నిరాకరించాలి : 48.37%

అది డిసైడ్ చేయాల్సింది నేను కాదు : 15.27%

ఇరుగుపొరుగుతో స్నేహం, శాంతితో ఉండాలన్న ప్రధాని మోదీ ప్రతిపాదనకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నమ్మకద్రోహం చేశాడా?

జిన్ పింగ్ వెన్నుపోటు పొడిచాడు : 62.05%

జిన్ పింగ్ ఎన్నికైన నేతే కాదు.. ఇంకేం ఆశిస్తాం : 24.54%

జిన్ పింగ్ విస్తరించాలని చూస్తున్నారు: 13.41%

చైనాతో పోరాటంలో భారత్‌కు నమ్మదగిన మిత్రుడు ఎవరు?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ : 18.12%

రష్యా అధ్యక్షుడు పుతిన్ : 19.32%

జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా : 10.35%

ఎవరూ కాదు. ఆత్మనిర్భర్ భారత్ కావాలి : 52.21%

First published:

Tags: India-China, Indo China Tension, Network18, News18

ఉత్తమ కథలు