#News18PublicSentimeter | మరిన్ని చైనీస్ యాప్స్ బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు

#News18PublicSentimeter | భారత ప్రభుత్వం ఇటీవల 59 చైనీస్ యాప్స్‌ను బ్యాన్ చేసింది. మరిన్ని చైనీస్ యాప్స్‌ను కూడా బ్యాన్ చేయాలని నెటిజన్లు సమర్థిస్తున్నారు.

news18-telugu
Updated: July 2, 2020, 9:26 PM IST
#News18PublicSentimeter | మరిన్ని చైనీస్ యాప్స్ బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు
#News18PublicSentimeter
  • Share this:
#News18PublicSentimeter పేరుతో నెట్ వర్క్ 18 వివిధ భాషల్లోని వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఇటీవల భారత ప్రభుత్వం టిక్ టాక్, హెలో, యూసీ సహా పలు యాప్స్‌ను నిషేధించింది. దీనిపై నెటిజన్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు నెట్ వర్క్ 18 ప్రయత్నించింది. ఈ సర్వేలో పాల్గొన్న నెటిజన్లలో అత్యధిక శాతం మంది చైనీస్ యాప్స్ బ్యాన్ చేయడాన్ని సమర్థించారు. మరిన్ని కూడా బ్యాన్ చేయాలనే ప్రశ్నకు ఔనని సమాధానం ఇచ్చారు.

చైనీస్ యాప్స్‌ను బ్యాన్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా?

ఔను : 89.3 %
కాదు : 7.9 %
చెప్పలేను : 2.7 %

ఇతర చైనీస్ యాప్స్‌ను కూడా బ్యాన్ చేయాలంటారా?
ఔను : 86.8 %కాదు : 8.6 %
చెప్పలేను : 4.5 %

చైనీస్ యాప్స్ మన డేటాను తస్కరించి, మన మీద నిఘా పెడుతున్నాయని నమ్ముతారా?
ఔను : 77.5 %
కాదు : 8.5 %
చెప్పలేను : 13.8 %

భారత్ నిబంధనలను అంగీకరిస్తే ఆ యాప్స్ మీద బ్యాన్ ఎత్తేయడానికి అంగీకరిస్తారా?
ఔను : 31.4 %
కాదు : 57.1 %
చెప్పలేను : 11.4 %

చైనీస్ కంపెనీలైన హువాయ్, జీటీఈ లాంటి వాటి నుంచి టెలికం ఎక్విప్‌మెంట్ వాడడాన్ని భారత్ కచ్చితంగా బ్యాన్ అమలు చేయాలంటారా?
ఔను : 80.2 %
కాదు : 11.3 %
చెప్పలేను : 8.4 %

బ్యాన్ ఎత్తివేస్తే మళ్లీ చైనీస్ యాప్స్ వినియోగిస్తారా?
ఔను : 14.5 %
కాదు : 76.7 %
చెప్పలేను : 8.8 %

‘మేడిన్ చైనా’ లేబుల్స్ ‌ను స్పష్టంగా కనిపించేలా ఈ కామర్స్ కంపెనీలు అమలు చేయాలా?
ఔను : 71.7 %
కాదు : 16.1 %
చెప్పలేను : 12 %

First published: July 2, 2020, 9:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading