సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై భారత్, చైనా కీలక నిర్ణయం

మే2వ తేదీ నాటి పరిస్థితులు నెలకొనాలని భారత్ డిమాండ్ చేస్తోంది. మే 2న వరకు ఎల్‌ఏసీకి ఇరుదేశాల సైన్యాలు ఎంత దూరంలో ఉన్నాయో.. ఇప్పుడు అంతే దూరం వెళ్లాలని పట్టుబట్టుతోంది. ఇప్పటికే సోమవారం కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరగ్గా.. మంగళవారం, బుధవారం కూడా ఇవి కొనసాగనున్నాయి.

news18-telugu
Updated: June 23, 2020, 2:27 PM IST
సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై భారత్, చైనా కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో భారత్, చైనా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇరుదేశాల సైన్యాలు చర్చలు జరుపుతున్నాయి. ఎల్‌ఏసీ వద్ద గొడవలకు తావులేకుండా పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా భారత్, చైనా మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు కూడా సానుకూల వాతావరణంలో జరిగాయని ఆర్మీ అధికారులు తెలిపారు.


మోల్డోలో సోమవారం సుమారు 10 గంటల పాటు చర్చలు జరిగాయి. సుహృద్భావ, సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో ఇరు దేశాల అధికారులు చర్చించారు. ఉద్రిక్త పరిస్థితుల నుంచి సాధారణ పరిస్థితి తీసుకువచ్చేందుకు ఏకాభిప్రాయానికి వస్తున్నాం. ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లేందుకు ఇరువురు పరస్పర అంగీకారానికి వచ్చాం. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని ఘర్షణ ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లే కార్యాచరణపై చర్చించాం. ఇరుదేశ సైన్యాలు దీన్ని పాటించేలా చూస్తాం.
ఇండియన్ ఆర్మీ


ఐతే చైనా బలగాలు ఎల్ఏసీకి అతి దగ్గరగా వచ్చాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే2వ తేదీ నాటి పరిస్థితులు నెలకొనాలని భారత్ డిమాండ్ చేస్తోంది. మే 2న వరకు ఎల్‌ఏసీకి ఇరుదేశాల సైన్యాలు ఎంత దూరంలో ఉన్నాయో.. ఇప్పుడు అంతే దూరం వెళ్లాలని పట్టుబట్టుతోంది. ఇప్పటికే సోమవారం కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరగ్గా.. మంగళవారం, బుధవారం కూడా ఇవి కొనసాగనున్నాయి. భారత్ తరపు 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరిందర్ సింగ్ చర్చల్లో పాల్గొంటున్నారు.

కాగా, జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘటనలో కల్నల్ సంతోష్ బాబ సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన 43 మంది సైనికులు మరణించినట్లు భారత్‌తో పాటు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఐతే చైనా మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ... అధికారిక మీడియా మాత్రం పలువురు చైనా జవాన్లు కూడా చనిపోయారని తెలిపింది. ఐతే భారత్ చెబుతున్నట్లుగా అంత మంది చనిపోలేదని.. 20 మంది లోపే మరణించి ఉంటారని వెల్లడించింది.
First published: June 23, 2020, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading