భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం ముదురుతున్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. భారత్‌తో పాటు దక్షిణాసియాకు చైనా ముప్పు పొంచి ఉందని.. ఈ క్రమంలోనే చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా దళాలను తరలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. గురువారం బ్రస్సెల్ ఫోరం వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. జర్మనీలో అమెరికా సాయుధ బలగాలను ఎందుకు తగ్గిస్తున్నారన్న ప్రశ్నకు మైక్ పంపియో బదులిస్తూ.. వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Citing threats from Chinese communist party to India & South East Asia, US will be "postured appropriately" & that is why reducing troops in Europe: US Secretary of state Mike Pompeo pic.twitter.com/aFE1XH7glZ
— puspendra kulshresth (@puspendraarmy) June 26, 2020
భారత్, ఇండియా గల్వాన్ ఘర్షణలపై స్పందిస్తూ.. గతవారం చైనాపై మైక్ పాంపియో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జనాభా పరంగా రెండు అతి పెద్ద దేశాల మధ్య ఘర్షణపూరితమైన వాతావరణం ఇరుపక్షాలకు నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా రూపంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో చైనా అవలంభిస్తున్న విధానం సహేతుకమైనది కాదని విరుచుకుపడ్డారు. హాంకాంగ్ స్వేచ్ఛా స్వాతంత్రంపై చైనా గుత్తాధిపత్యం ఆ దేశ పౌరులకు పెను ప్రమాదమని హెచ్చరించారు పాంపియో. పక్క దేశ పౌరుల స్వేచ్ఛను హరించే హక్కు చైనాకు లేదని మండిపడ్డారు. అంతేకాదు దక్షిణ చైనా సముద్రం, జపాన్, మలేషియా దేశాలతో చైనా వివాదాలను సైతం ఆయన తప్పుబట్టారు.
కాగా, జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘటనలో కల్నల్ సంతోష్ బాబ సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన 43 మంది సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఐతే చైనా మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Galwan Valley, India-China, Indo China Tension