Micromax: చైనా ఫోన్లు వద్దా...అయితే ఇండియన్ కంపెనీ రూ.10 వేల లోపు స్మార్ట్ ఫోన్స్ మీకోసం...

ఇప్పటికే చైనా ఫోన్లను బాయ్ కాట్ చేయాలనే కాల్ బాగా పాపులర్ అయ్యింది. ఈ నేపథ్యంలో దేశీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముందుకు దిగింది.

news18-telugu
Updated: June 23, 2020, 12:58 PM IST
Micromax: చైనా ఫోన్లు వద్దా...అయితే ఇండియన్ కంపెనీ రూ.10 వేల లోపు స్మార్ట్ ఫోన్స్ మీకోసం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
భారత స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ రాబోయే వారాల్లో మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించి కంపెనీ ట్వీట్‌ చేసింది. త్వరలో బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది, దీనిలో ప్రీమియం ఫీచర్లతో పాటు ఆకర్షణీయమైన డిజైన్ అందించనున్నారు. ఇప్పటికే చైనా ఫోన్లను బాయ్ కాట్ చేయాలనే కాల్ బాగా పాపులర్ అయ్యింది. ఈ నేపథ్యంలో దేశీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముందుకు దిగింది.

గాడ్జెట్ 360 యొక్క నివేదిక ప్రకారం, మైక్రోమాక్స్ వచ్చే నెలలోగా భారతదేశంలో సుమారు 3 స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది, దీని ధర రూ .10,000 లోపు ఉంటుంది. ఇదే జరిగితే, రాబోయే మైక్రోమాక్స్ ఫోన్లు మార్కెట్లో ఉన్న అనేక చైనీస్ ఫోన్‌లకు గట్టి పోటీని ఇవ్వగలవు.

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మైక్రోమాక్స్ చాలా కాలంగా చైనా ఫోన్ల ధాటికి ఏ ఫోన్‌ను మార్కెట్లోకి విడుల చేయలేదు. అయితే ఇఫ్పుడు భారత్, చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌కు ప్రత్యామ్నాయం కోసం మొబైల్ ప్రియులు వెతుకుతున్నారు. అయితే దీనికి మైక్రోమాక్స్ దీనికి సరిపోయే ప్రత్యామ్నాయంగా మిగిలింది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, కంపెనీ ట్వీట్‌తో పాటు, కంపెనీ #VocalForLocal, #MadeByIndian మరియు #MadeForIndian హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఉపయోగిస్తోంది.
First published: June 23, 2020, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading