LT GENERAL VK JOSHI ABOUT GALWAN VALLEY INCIDENT AND OTHER ISSUES WITH CHINA AK
Exclusive: గల్వాన్ ఘటన.. చైనా వైపు కూడా మరణాలు.. ప్రత్యేక ఇంటర్వ్యూలో లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి
లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి (Image;@NorthernComd_IA/Twitter)
కమాండర్ స్థాయిలో జరిగిన చర్చలు ఇరు దేశాలకు చెందిన బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించారని వైకే జోషి తెలిపారు. ప్రస్తుతానికి ఆ ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడానికి ఉన్నాయని.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ నార్తన్ కమాండ్ అయిన లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి CNN News18 డిఫెన్స్ ఎడిటర్ శ్రేయా ధోండియాల్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
గల్వాన్ ఘటనలో చైనా వైపు కూడా నష్టం జరిగిందని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ నార్తన్ కమాండ్ అయిన లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి CNN News18 డిఫెన్స్ ఎడిటర్ శ్రేయా ధోండియాల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. చాలామంది సైనికులను అక్కడి నుంచి స్ట్రెచర్స్పై తీసుకెళ్లారని జనరల్ వైకే జోషి తెలిపారు. అలాంటి వారి సంఖ్య దాదాపు 60 వరకు ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే వారిలో ఎంతమంది చనిపోయారు ? ఎంతమంది బతికున్నారనే విషయాన్ని చెప్పలేమని అన్నారు. అయితే ఇటీవల టస్ అనే రష్యన్ ఏజెన్సీ.. చైనా వైపు చనిపోయిన వారి సంఖ్య 45 వరకు ఉంటుందని పేర్కొన్నట్టు తెలిపారు. అయితే ఈ సంఖ్య అంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చని వైకే జోషి అన్నారు. ఇక చైనా మన భూభాగంపై కన్నేసిన విషయాన్ని ముందుగానే ఊహించకపోవడం వైఫల్యం కాదని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఖంగేశ్వర్, సైదుల్లా ప్రాంతాలకు వస్తుంటాయని అన్నారు.
గతేడాది కూడా అదే జరిగిందని.. అయితే గల్వాన్కు వచ్చిన తరువాతే వారి ఉద్ధేశ్యం అర్థమైందని లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. అది తెలియగానే ఏ రకంగా స్పందించాలో.. అలా స్పందించామని అన్నారు. వారికి ధీటుగా బదులిచ్చామని చెప్పారు. తాను తన జీవితం మొత్తం లద్ధాఖ్లోనే గడిపానని అన్నారు. ఇలాంటి ఓ పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఆ స్థాయిలో బలగాలు, ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు వస్తాయని ఊహించలేదని తెలిపారు. అయితే సరిహద్దుల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. అక్కడ పని చేసే సమయంలో నీటి సమస్య ఉండేదని తెలిపారు. బలగాల కోసం నీటిని తీసుకెళ్లామని అన్నారు.
అయితే ఆ తరువాత ఇంజినీర్లు రంగంలోకి దిగి 20 బోర్లు తవ్వారని వివరించారు. అలా నీటి సమస్యను అధిగమించామని అన్నారు. ఈ విషయంలో సైనికులు పడిన శ్రమను మర్చిపోలేమని లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి అన్నారు. ఒక్కోసారి మైనస్ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని గుర్తు చేసుకున్నారు. అయితే మంచి టెంట్లు, బెడ్లు వంటిని చాలావరకు ఉపయోగపడ్డాయని తెలిపారు. ఓ వైపు ప్రతికూల వాతావరణం, మరోవైపు చైనా బలగాలను దృష్టిలో పెట్టుకుని పరిస్థితిని అధిగమించామని వెల్లడించారు. చైనీయులు గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించారని అన్నారు. మళ్లీ వారిని నమ్మడానికి చాలా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం చైనా చాలా చేయాల్సి ఉందని అన్నారు.
కమాండర్ స్థాయిలో జరిగిన చర్చలు ఇరు దేశాలకు చెందిన బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించారని వైకే జోషి తెలిపారు. ప్రస్తుతానికి ఆ ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడానికి ఉన్నాయని.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. చైనాతో సరిహద్దు సమస్య కోసం ముందుగా సరిహద్దు నియంత్రణ రేఖ విషయంలో ఓ అవగాహనకు రావాల్సి ఉందని వైకే జోషి అన్నారు. అదే జరిగే వరకు ఇలాంటివి తప్పవని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ చైనాకు మొదటిసారి వెళ్లినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారని.. ఆ తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని అన్నారని లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి గుర్తు చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.