Home /News /india-china /

LINK FOR TIKTOK BEING SHARED ON WHATSAPP IS ACTUALLY MALWARE MAHARASHTRA CYBER CELL ISSUES ADVISORY

Tiktok Ban: తస్మాత్ జాగ్రత్త...దొడ్డిదారిన టిక్ టాక్ డౌన్‌లోడ్ చేసుకుంటే కష్టాలే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tiktok Ban | వాట్సప్‌లో వచ్చే లింక్ ద్వారా టిక్ టాక్ ప్రొ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని మహారాష్ట్ర సైబర్ సెల్ హెచ్చరించింది. మాల్ వేర్ ద్వారా సైబర్ నేరగాళ్ల బారినపడే అవకాశముందని తెలిపింది.

    టిక్ టాక్, హెలో, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనీస్ యాప్స్‌ను భారత ప్రభుత్వం ఇటీవల బ్యాన్ చేయడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టిక్‌ టాక్‌ను బ్యాన్ చేసిన మరుసటి రోజే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా దాన్ని తొలగించారు. అయితే కొందరు అక్రమ మార్గాల్లో టిక్ టాక్‌ను తమ మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్య టిక్ టాక్‌ యాప్‌ను ఇక్కడ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటూ ఓ లింక్ వాట్సప్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ లింక్‌ను క్లిక్ చేసి కొందరు అనధికారికంగా టిక్ టాక్ ప్రొ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అలా అనధికారికంగా టిక్ టాక్‌ యాప్‌ను మీ మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుంటే కోరి ప్రమాదం తెచ్చుకున్నట్లేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సప్‌లో వచ్చిన లింక్‌తో ఏపీకే ఫైల్ ద్వారా టిక్ టాక్ ప్రొ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారు త్వరలో సైబర్ దాడికి గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

    China Apps Ban, Chinese Apps Banned, India bans china apps, TikTok banned, 59 china apps baned, Govt notice to China Apps, చైనా యాప్స్ పై నిషేధం, టిక్ టాక్ బ్యాన్, టిక్‌టాక్‌పై నిషేధం, 59 చైనా యాప్స్‌పై నిషేధం, చైనా యాప్స్‌కు నోటీస్
    ప్రతీకాత్మక చిత్రం


    టిక్ టాక్ ప్రో పేరుతో వాట్సప్‌లో వచ్చే ఏపీకే ఫైల్‌ను క్లిక్ చేస్తే యాప్‌తో పాటు మాల్ వేర్ కూడా మీ ఫోన్లో చొరబడే ప్రమాదముందని మహారాష్ట్ర సైబర్ సెల్ కూడా హెచ్చరించింది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మాల్ వేర్ ద్వారా మీ పర్మీషన్ లేకుండానే మీ మొబైల్ ఫోన్‌లోని మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చేరే అవకాశముందన్నారు. అండ్రాయిడ్ ఫోన్లో యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

    అలా కాకుండా సైడ్ లోడింగ్ పద్ధతిలో యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ల బారిపడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తవహించినా మీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును సైబర్ నేరగాళ్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకునే అవకాశముందంటున్నారు. ప్రభుత్వం నిషేధించిన చైనీస్ యాప్స్ జోలికి వెళ్లకపోవడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారినపడొద్దని సూచిస్తున్నారు.
    Published by:Janardhan V
    First published:

    Tags: Tik tok, US-China

    తదుపరి వార్తలు