Home /News /india-china /

LADAKH STANDOFF INDIA CHINA MEET TODAY DELHI TO PUSH FOR TROOP WITHDRAWAL REMOVAL OF CONSTRUCTIONS NK

నేడు భారత్-చైనా కమాండర్ స్థాయి చర్చలు... లడక్ వివాదంపై డ్రాగన్‌ని నమ్మొచ్చా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓవైపు సరిహద్దుల్లో చొచ్చుకొస్తూనే మరోవైపు చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటామంటున్న చైనా... లడక్ వివాదంపై ఏం మాట్లాడుతుందన్నది చర్చనీయాంశమైంది.

    భారత్, చైనాకి చెందిన టాప్ కమాండర్లు ఇవాళ భేటీ కాబోతున్నారు. నెల నుంచి నలుగుతున్న లఢక్ వివాదంపై చర్చించబోతున్నారు. ప్రధానంగా చైనా.... భారత సరిహద్దుల్లోకి తన సైన్యం చొచ్చుకెళ్లేలా చేస్తోంది. అలాగే... లడక్‌లో సైనిక శిబిరాలు, బంకర్లు ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున ఆర్మీనీ, ఆయుధాలనూ దింపుతోంది. దీనిపై భారత్ అభ్యంతరం చెబుతోంది. సైన్యాన్ని వెనక్కి పంపాలనీ, స్థావరాల్ని కూల్చివేయాలని భారత్ కోరుతోంది. ఈ విషయమై నెల రోజులుగా సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య అనధికారిక మాటల యుద్ధం జరుగుతోంది. అప్పుడప్పుడూ కొట్టుకుంటున్నారు కూడా.

    మే 5న తొలిసారి లడక్ సరిహద్దుల్లోని పాంగోంగ్ సో దగ్గర రెండు సైన్యాల మధ్యా గొడవ జరిగి... 200 మంది గాయపడ్డారు. మే 9న మరోసారి జరిగిన గొడవలో ఓ పది మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఒకట్రెండుసార్లు రెండు దేశాల మధ్య కింది స్థాయిలో చర్చలు జరిగాయి. అయిన సమస్య పరిష్కారం కాకపోవడంతో... ఇవాళ మరోసారి చర్చ జరగనుంది. తూర్పు లఢక్‌... చుషుల్ సెక్టార్‌లోని... మాల్డో దగ్గర ఈ చర్చలు జరగనున్నాయి. భారత్ తరపున 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ ఈ చర్చలో పాల్గొంటున్నారు.

    చైనాతో భారత్‌కి సరిహద్దు సమస్య స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే ఉంది. రెండు దేశాల మధ్య సరిహద్దు సరిగా లేదు. ఏళ్లుగా సరిహద్దుపై రెండు దేశాల మధ్యా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు... తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి పక్కన పెడదాం. అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. చర్చల వల్ల ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు తక్కువే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే... ఎలాగైనా భారత భూభాగాన్ని లాక్కోవాలని కుట్రలు పన్నుతున్న చైనా... తన తీరు అస్సలు మార్చుకోవట్లేదు. ఒకవేళ చైనా వెనక్కి తగ్గితే... అది భారత్‌కి ఉపశమన చర్యే అనుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: India-China

    తదుపరి వార్తలు