చైనా-నేపాల్‌ను కలుపుతూ రహదారి సిద్ధం...భారత్‌కు కొత్త చికాకులు...

టిబెట్ రాజధాని లాసా నుండి నేపాల్ బోర్డర్‌లోని ఖాసా వరకూ చైనా- నేపాల్ ఫ్రెండ్షిప్ హైవే పేరిట రోడ్డు మార్గం డెవలప్ చేసింది. సుమారు 800 కిలోమీటర్ల ఈ రహదారి చైనా మరియు నేపాల్ మధ్య వాణిజ్యానికి ప్రధాన మార్గంగా చెప్పవచ్చు. చైనా, నేపాల్ సరిహద్దులను కలుపుతూ రోడ్డు నిర్మాణంతో భారత్ ఆందోళనలకు కారణమైంది.

news18-telugu
Updated: June 23, 2020, 2:09 PM IST
చైనా-నేపాల్‌ను కలుపుతూ రహదారి సిద్ధం...భారత్‌కు కొత్త చికాకులు...
చైనా, నేపాల్ రహదారి
  • Share this:
భారత్ తో చిరకాల మిత్రుడిగా స్నేహ సంబంధాలు కొనసాగించిన నేపాల్, ఇప్పుడు చైనా కనుసన్నల్లోకి వెళ్లిపోయింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆర్థికంగా భారత్ పై ఆధారపడిన నేపాల్ దేశాన్ని, చైనా దీర్ఘకాలంగా తన వైపు లాగాలని ప్రయత్నం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే నేపాల్ ను మచ్చిక చేసుకునేందుకు వ్యాపార బంధాన్ని కలుపుకుంది. అంతేకాదు ఇటీవలే...టిబెట్ రాజధాని లాసా నుండి నేపాల్ బోర్డర్‌లోని ఖాసా వరకూ చైనా- నేపాల్ ఫ్రెండ్షిప్ హైవే పేరిట రోడ్డు మార్గం డెవలప్ చేసింది. సుమారు 800 కిలోమీటర్ల ఈ రహదారి చైనా మరియు నేపాల్ మధ్య వాణిజ్యానికి ప్రధాన మార్గంగా చెప్పవచ్చు. చైనా, నేపాల్ సరిహద్దులను కలుపుతూ రోడ్డు నిర్మాణంతో భారత్ ఆందోళనలకు కారణమైంది.

నేపాల్, చైనా దేశాధినేతలు


చైనా, నేపాల్ మైత్రి రహదారి కథేంటి...
వాస్తవానికి, ఈ రహదారిని రెండు వేర్వేరు రహదారులను కలపడం ద్వారా నిర్మించారు. ఈ రహదారి లాసా నుండి లాట్సే వరకు ప్రయాణించి, ఆపై దక్షిణ దిశగా నేపాల్ సరిహద్దుకు చేరుకుంటుంది. ఈ రహదారి రెండో భాగం లాట్సే నుంచి టిబెట్ పశ్చిమాన గార్ ప్రాంతానికి చేరుకుంటుంది. అయితే ఈ రహదారి కైలాష్ పర్వతం, మానస సరోవర్ పర్వతాలకు వెళ్ళే పర్యాటకులకు ఉపయోగపడుతుంది.

కాగా ఐదేళ్ల క్రితం నేపాల్, టిబెట్ సరిహద్దులలో ఈ హైవే దెబ్బతిన్నది, దీని కారణంగా ఇది ఒక సంవత్సరానికి పైగా మూసివేశారు. అయినప్పటికీ 2016 లో పునర్నిర్మాణం తరువాత చైనా, నేపాల్ మధ్య వాణిజ్యం కోసం తెరిచారు. అయితే 2017 నాటికి ఇది పర్యాటకుల కోసం కూడా తెరిచారు.

ఈ రహదారి మార్గం ముఖ్యం
లాసా నుండి నేపాల్ బోర్డర్ వరకూ ఈ రహదారిపై చాలా సుందరమైన, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, అయితే ఈ రహదారికి భౌగోళికంగా మరియు వ్యూహాత్మకంగా కూడా ప్రాముఖ్యత ఉంది. ఎవరెస్ట్ శిఖరం కూడా రహదారికి వెళ్లే మార్గంలోనే ఉంది. ఈ రహదారి ముగుస్తున్న చోట, చైనా, నేపాల్ సరిహద్దులో ఫ్రెండ్షిప్ వంతెన ఉంది. అయితే ఈ సరిహద్దులోని కొడరి అనే పట్టణం నుండి ఈ రహదారి ఖాట్మండుకు మరో ప్రత్యేక రహదారి ఉంది. దీనిని ఆర్నికో హైవే అని పిలుస్తారు. అంటే చైనా, నేపాల్ ఫ్రెండ్షిప్ వంతెన ద్వారా, ఎర్నికో రహదారిని జతచేస్తే, చైనాలోని లాసా నుంచి ఖాట్మండు వరకు పూర్తి మార్గం సిద్ధంగా ఉంది.
కొడారి, నేపాల్-చైనా సరిహద్దులోని ఒక పట్టణం. వికీకామన్స్ నుండి చిత్రం.


చైనా, నేపాల్ మధ్య వాణిజ్య మార్గం
ఈ రహదారి చైనా మరియు నేపాల్ మధ్య వాణిజ్యానికి జీవనాడి. 2015 భూకంపం, ఆ తరువాత జరిగిన పరిణామాలతో నేపాల్ సరిహద్దులను భారత్ మూసివేసింది. దీంతో వాణిజ్యం కూడా నిలిపివేసింది. ఆ సమయంలో భూకంపం కారణంగా చిక్కుకున్న నేపాల్ ప్రజలు, నేపాల్ నాయకులు వాణిజ్యం కోసం కేవలం ఒకే దేశంపై ఆధారపడితే కష్టాలకు గురవుతామని అందుకు ప్రత్యామ్నాయంగా చైనాతో వాణిజ్యానికి తెరలేపాల్సి వచ్చింది.

చైనాతో అనుసంధానించబడిన ఈ రహదారి నేపాల్‌ను కొడారి పట్టణంతో కలుపుతుంది. కొడారి నుండి ఖాట్మండు వరకు ఉన్న రహదారిని భౌగోళిక రాజకీయాల సమస్యగా మార్చారు. దేశం భారత సరిహద్దులతో చుట్టుముట్టిందని, భారతదేశంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మాత్రమే కొడారి హైవే ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేపాల్ స్పష్టం చేసింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని నేపాల్ రాయబారి ఇలా అన్నారు...చైనాతో నేపాల్ కుదుర్చుకున్న ఒప్పందంపై భారత్ కోపంగా ఉంది. నేపాల్ చైనా అడుగుజాడల్లో పడుతోందని భారత్ భావిస్తుంది, కానీ  అలా కాదు.  నేపాల్ ఎప్పటికీ చైనా బంటుగా మారదు. అని తెలిపారు.

కానీ ఇటీవల నేపాల్ ఇటీవల మ్యాప్‌ను మార్చడం, రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా సరిహద్దు వివాదానికి ఆజ్యం పోసింది.
First published: June 23, 2020, 2:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading