Kaagaz Scanner: క్యామ్ స్కానర్ బదులు కాగజ్ స్కానర్ వాడుతున్నారా? ఈ విషయం తెలుసా?

Kaagaz Scanner App | చైనా యాప్స్ నిషేధించడంతో భారతీయ యాప్స్‌కు డిమాండ్ పెరిగిపోతోంది. చైనాకు చెందిన క్యామ్ స్కానర్ బ్యాన్ చేయడంతో ప్రత్యామ్నాయంగా ఇండియాకు చెందిన కాగజ్ స్కానర్ తెరపైకి వచ్చింది.

news18-telugu
Updated: July 3, 2020, 4:33 PM IST
Kaagaz Scanner: క్యామ్ స్కానర్ బదులు కాగజ్ స్కానర్ వాడుతున్నారా? ఈ విషయం తెలుసా?
Kaagaz Scanner: క్యామ్ స్కానర్ బదులు కాగజ్ స్కానర్ వాడుతున్నారా? ఈ విషయం తెలుసా? (image: Playstore)
  • Share this:
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిలో టిక్‌టాక్, హెలో, షేర్ ఇట్, క్యామ్ స్కానర్ లాంటి పాపులర్ యాప్స్ చాలా ఉన్నాయి. బ్యాన్ అయిన యాప్స్ అన్నిటికీ ప్రత్యామ్నాయ యాప్స్ ప్లేస్టోర్‌లు ఉన్నాయి. డాక్యుమెంట్స్‌ని స్కాన్ చేసేందుకు క్యామ్ స్కానర్ యాప్‌ను ఉపయోగించేవారు యూజర్లు. డేటా, ప్రైవసీ ఆరోపణల కారణంగా ఈ యాప్‌ను నిషేధించారు. ఇప్పుడు క్యామ్ స్కానర్ యూజర్లను భారతదేశానికి చెందిన కాగజ్ స్కానర్ యాప్ ఆకట్టుకుంటోంది. ఇండియాకు చెందిన సార్టెడ్ ఏఐ స్టార్టప్ క్యామ్ స్కానర్‌కు ప్రత్యామ్నాయంగా కాగజ్ స్కానర్ తయారు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'వోకల్ ఫర్ లోకల్', 'ఆత్మ నిర్భర్ భారత్' పిలుపు మేరకు ఈ యాప్ రూపొందించినట్టు సార్టెడ్ ఏఐ ఫౌండర్ గౌరవ్ శ్రీశ్రీమల్ తెలిపారు.

Alternative Apps: టిక్‌టాక్, హెలో, షేర్ ఇట్ యాప్స్‌కు ప్రత్యామ్నాయ యాప్స్ ఇవే

Jio offer: జియో యూజర్లకు ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్... ప్లాన్స్ ఇవే

క్యామ్ స్కానర్ యాప్‌ని నిషేధించడంతో కాగజ్ స్కానర్ వార్తల్లోకి వచ్చింది. క్యామ్ స్కానర్ బ్యాన్ చేసిన ఒక్క రోజులోనే 1,00,000 మందికి పైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. కాగజ్ స్కానర్ కూడా క్యామ్ స్కానర్‌లాగానే డాక్యుమెంట్స్‌ని స్కాన్ చేస్తుంది. అయితే ఈ యాప్ ఉపయోగించే ముందు ప్రైవసీ పాలసీ తెలుసుకోవడం మంచిది. కాగజ్ స్కానర్ ఇండియాకు చెందిన యాప్ అయినా ప్రైవసీ పాలసీ తెలుసుకోవాలి. లేకపోతే మీ డేటాకు ముప్పు తప్పదు. గూగుల్ ప్లే స్టోర్‌లో కాగజ్ స్కానర్ యాప్ రేటింగ్ బాగానే ఉన్నా, రివ్యూలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. యాప్‌లో చాలావరకు బగ్స్ ఉన్నాయని ఇటీవల ఈ యాప్ ఉపయోగించిన యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు కాస్త నమ్మకమైన డాక్యుమెంట్ స్కానింగ్ యాప్స్ ఉపయోగించడం మంచిది.
First published: July 3, 2020, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading