IPL 2020 SUNRISERS HYDERABAD PLAYERS INDULGE IN BOTTLE FLIP CHALLENGE SK
IPL 2020: బాల్ బ్యాట్ పక్కనపెట్టి బాటిల్స్‌తో కుస్తీ.. వీళ్లేం చేస్తున్నారు?
బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ (Image:SRH)
IPL 2020: అనవసరపు ఛాలెంజ్‌లు పక్కనబెట్టి.. గేమ్‌పై శ్రద్ధ పెట్టాలని కొందరు సూచిస్తున్నారు. లేదంటే ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం సమద్ బాగా ఆడాడని మెచ్చుకుంటున్నారు.
IPL 2020: యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 టోర్నీలో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అన్ని జట్లు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ను ఆడాయి. ప్లే ఆఫ్స్‌కు చేరుకునేందుకు అన్ని టీమ్‌లూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సూపర్ ఓవర్లు, ఫైనల్ బాల్ సిక్స్‌లు, ఉత్కంఠ విజయాలు..ఇలా ఎన్నో ట్విస్ట్‌లు.. మరెంతో ఎంటైర్టైన్మెంట్తో.. రసవత్తరరంగా సాగుతోంది ఐపీఎల్ టోర్నీ. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తల మధ్య మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులు లేకుండానే.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఎంతో పకడ్బందీగా టోర్నీని ముందుకు తీసుకెళ్తున్నారు నిర్వాహకులు.
ఇక ప్లేయర్స్ కూడా వరుస మ్యాచ్‌లతో బిజీ అయ్యారు. ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. ఎప్పుడూ బాల్, బ్యాట్‌తోనే ఆడడంతో అప్పుడప్పుడూ బోర్ కొడుతుంది. అందుకే ఫన్నీ టాస్క్‌లు, వెరైటీ ఛాలెంజ్‌తో ఆడవిడుపు పొందుతున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ వినూత్న ఛాలెంజ్‌ని పరిచయం చేశారు. అదే బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్..! తీసుకొచ్చారు. గ్రౌండ్లో ప్రాక్టీస్‌ను కాసేపు పక్కనబెట్టి బాటిళ్లతో కుస్తీ పట్టారు. రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్, ప్రియాంగ్ గార్గ్‌తో పలువురు ఆటగాళ్లు ఇందులో పాల్గొన్నారు. బాటిల్‌ను గాల్లోకి ఫ్లిప్ చేస్తే.. అది కిందకు చేరుకొని యధావిధిగా నిలబడాలి.
మొదట అందరూ ట్రయల్స్ వేశారు. ఆ తర్వాత గేమ్ మొదలు పెట్టారు. బాటిల్‌ను నిలబెట్టలేని ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తప్పుకున్నారు. చివరకు అబ్దుల్ సమద్ గెలిచాడు. ఈ వీడియోను సన్ రైజర్స్ టీమ్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. SRH బాటిల్ ఫ్లిప్ ఛాంపియన్ ఎవరు? అని ట్వీట్ చేసింది. దాంతో పాటు ఫన్నీ ఎమోజీని పెట్టారు. ఆ వీడియోను ఇప్పటి వరకు 12 వేల మందికి పైగా వీక్షించారు.
ఈ ట్వీట్‌పై క్రీడాభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అనవసరపు ఛాలెంజ్‌లు పక్కనబెట్టి.. గేమ్‌పై శ్రద్ధ పెట్టాలని కొందరు సూచిస్తున్నారు. లేదంటే ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం సమద్ బాగా ఆడాడని మెచ్చుకుంటున్నారు.
కాగా, ఈ టోర్నీలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి 6 పాయింట్లు సాధించింది. మరో ఐదు మ్యాచ్‌లలో పరాజయం పాలయింది. గత మ్యాచ్‌లో చెన్నై జట్టుపై హైదరాబాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే. 168 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 20 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. ఇక హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం ఆడనుంది. అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడబోతోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.