చైనా, ఇండియా సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఇరు దేశాల సైనికులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో భారత్ ఆర్మీకి చెందిన కమాండింగ్ ఆఫీసర్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా పలువురు మరణించారని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. లద్దాఖ్‌లోని గల్వాన్ వ్యాలీ సమీపంలో LAC నుంచి ఇరుదేశ బలగాలు వెనక్కి వెళ్తున్న క్రమంలోనే ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఐతే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగలేదని..పరస్పరం రాళ్లు రువ్వుకున్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
లద్దాఖ్‌లో ఉద్రిక్తతలకు సంబంధించి ఇప్పటికే ఆర్మీ వర్గాలు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించాయి. అసలు అక్కడ ఏం జరిగింది? ప్రస్తుత పరిస్థితి ఏంటి? అన్న వివరాలను తెలియజేశారు. అంతేకాదు సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు, విదేశాంగమంత్రి జైశంకర్‌తో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమై చర్చించారు. మరోవైపు ఈ ఘటనపై భారత్‌ను నిందించే ప్రయత్నం చేస్తోంది చైనా. సోమవారం రాత్రి భారత బలగాలే సరిహద్దు దాటి ముందుకొచ్చి.. తమను రెచ్చగొట్టాయని చైనా ఆర్మీ వర్గాలు తెలిపినట్లు చైనా మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది.
ఇరువర్గాల ఘర్షణపై చైనా విదేశాంగ సైతం స్పందించింది. LAC నుంచి భారత దళాలు వెనక్కి వెళ్లిపోవాలని స్పష్టం చేసినట్లు చైనా మీడియా తెలిపింది. సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు వర్గాలు ఇప్పటికే అంగీకరించాయని చైనా విదేశాంగశాఖ మంత్రిత్వశాఖ తెలిపింది. సరిహద్దుల్లో శాంతి స్థాపనకు కృషి చేస్తామని పేర్కొంది.
China and Indian side agreed to resolve the bilateral issues through dialogue to ease the border situation and maintain peace and tranquility in border areas, China's Global Times quotes their Foreign Minister
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.