భారత్ చైనా మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చైనా తన దుందుడుకు చర్యలతో భారత్ ను కవ్విస్తోంది. ఇప్పటికే గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల ఉద్రిక్తతలు మరువక ముందే మరోమారు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా బలగాల మధ్య గత అర్ధరాత్రి కాల్పులు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. చైనా సైన్యం ఎల్ఏసి వద్ద చైనా రెచ్చగొట్టేలా వ్యవహరించందని, సోమవారం, లడఖ్‌లోని పాంగ్యాంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున వాస్తవ నియంత్రణ రేఖను దాటి భారత సైనికులు ఎదురు కాల్పులు చేసారంటూ చైనా ఆరోపించింది. పరిస్థితిని స్థిరీకరించడానికి చైనా సరిహద్దు గార్డ్స్ కూడా ఎదురుదాడి చేయవలసి వచ్చిందని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా భారత వైపు నుండి ఇంకా స్పందన రాలేదు.
ఇదిలా ఉంటే భారత్ వైపు నుంచే మొదట కాల్పులు జరిపిందని భారత్ ఆర్మీ వాస్తవాధీన రేఖ దాటి పాంగాంగ్ లేక్, షెన్పావో పర్వత ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిందని చైనా సైనిక ప్రతినిధి ఆరోపించారు. ఈ ఘటనపై భారత్ వైపు నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.
కాగా గత రెండు వారాలలో రెండుసార్లు, చైనా దళాలు లడఖ్ పాంగ్యాంగ్ సరస్సు దక్షిణ ఒడ్డు వెంబడి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డాయి. కానీ ఎల్ఏసి రేఖను ఏకపక్షంగా మార్చే ఈ ప్రయత్నాలను నిరోధించగలిగాము" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటి వరకూ ఎలాంటి ఘర్షణలు లేవని పేర్కొంది.
ఆగష్టు 31 న చివరి సారి.. భారత సైనికులు మన LAC దాటిన చైనా సైనికులను చుట్టుముట్టారని, ముందుకు కొనసాగవద్దని హెచ్చరించారని, ఆ సమయంలో ఒక భారతీయ బ్రిగేడియర్‌తో చర్చలు జరిపిన చైనా సైనిక కమాండర్లు ఎలాంటి తీవ్ర పరిస్థితులు ఎదురుకాకుండా, తమ బలగాలను నిలబడమని చెప్పమని కోరినట్లు వర్గాలు తెలిపాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.