Indian Smarthones: చైనా ఫోన్స్‌పై బాయ్‌కాట్‌తో ఈ ఇండియన్ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు పండగే...

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయ కంపెనీలు అయిన Micromax, Karbonn, Lava పుంజుకునే వీలుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున పేటెంట్ రైట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు భారతీయ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి.

news18-telugu
Updated: June 28, 2020, 11:13 PM IST
Indian Smarthones: చైనా ఫోన్స్‌పై బాయ్‌కాట్‌తో ఈ ఇండియన్ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు పండగే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
smartphone మార్కెట్లో చైనా ఆధిపత్యానికి గండి కొట్టడానికి, భారతీయ phone తయారీ కంపెనీలు Micromax, Karbonn, Lava కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఫీచర్ ఫోన్ సెగ్మెంట్ లో మంచి వాటా కలిగి ఉన్న ఈ ఇండియన్ కంపెనీలకు ప్రస్తుతం...బాయ్ కాట్ చైనా ఉద్యమం కలిసి రానుంది. అయితే ప్రస్తుతం పది వేల రూపాయల ధరలో Xiaomi, Realme, Oppo, Vivo సంస్థలకు పోటీగా మెరుగైన మైక్రోమాక్స్ అనేక స్పెసిఫికేషన్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

వాస్తవానికి చైనా కంపెనీలు భారతీయ ఫోన్ మార్కెట్లో మార్చి 2020 నాటికి 81 శాతం వాటాను కలిగి ఉండగా, భారతీయ కంపెనీలు కేవలం 1 శాతం వాటా మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయ కంపెనీలు అయిన Micromax, Karbonn, Lava పుంజుకునే వీలుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున పేటెంట్ రైట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు భారతీయ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. ఈ విషయంలో Lava కంపెనీ కాస్త మెరుగ్గా ఉంది. ఫోన్ డిజైన్ మరియు సామర్థ్యాల విషయంలో ఇది చాలా కాలంగా తనకంటూ ప్రత్యేకమైన ఆర్ అండ్ డీ సంస్థను కలిగి ఉంది.

అంతేకాదు లావా సంస్థకు చెందిన ఎగుమతులకు సంబంధించిన ఫ్యాక్టరీ, R&D యూనిట్, డిజైనింగ్ యూనిట్ చైనాలో ఉన్నాయి. వాటిని ఇండియాకు తరలించేందుకు ఆ సంస్థ ఈ సంవత్సరం 80 కోట్ల రూపాయల వరకూ వెచ్చించబోతోంది. అదే విధంగా రాబోయే ఐదేళ్లలో పూర్తిస్థాయిలో తన కార్యకలాపాలను ఇండియాకు తరలించడం కోసం ఆ సంస్థ 800 కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టబోతోంది.

ఇక మైక్రోమాక్స్ కంపెనీ కూడా పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్లను తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు 10 వేల లోపు మూడు బడ్జెట్ ఫోన్లను విడుదలకు సిద్ధం చేస్తోంది.
First published: June 28, 2020, 11:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading