చైనా సంస్థతో భారతీయ రైల్వే తెగదెంపులు.. నిషేధం షురూ..

యూపీలోని కాన్పూర్‌- దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ సెక్షన్‌ మధ్య 417 కి.మీ. మేర టెలీకమ్యూనికేషన్, సిగ్నలింగ్ ప్రాజెక్టుకు సంబంధించి DFCCIL చైనా సంస్థతో 2016లో ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.471 కోట్ల రూపాయలు.

news18-telugu
Updated: June 18, 2020, 6:18 PM IST
చైనా సంస్థతో భారతీయ రైల్వే తెగదెంపులు.. నిషేధం షురూ..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత చైనాపై భారతీయులు మండిపడుతున్నారు. 20 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న డ్రాగన్‌పై కన్నెర్ర చేస్తున్నారు. చైనా ఉత్పత్తులను వాడొద్దంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం చేస్తున్నారు. చైనీ కంపెనీలతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చైనా కంపెనీతో కీలక ఒప్పందం రద్దు చేుకుంది. బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్‌ అండ్ డిజైన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ సంస్థకు 2016లో కేటాయించిన కాంట్రాక్టును రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఒప్పందం రద్దుకు సంబంధించి భారతీయ రైల్వేకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) సంస్థ ఒక ప్రకటన చేసింది. యూపీలోని కాన్పూర్‌- దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ సెక్షన్‌ మధ్య 417 కి.మీ. మేర టెలీకమ్యూనికేషన్, సిగ్నలింగ్ ప్రాజెక్టుకు సంబంధించి DFCCIL చైనా సంస్థతో 2016లో ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.471 కోట్ల రూపాయలు. ఒప్పందం ప్రకారం చైనా సంస్థ అవసరమైన సాంకేతిక పత్రాలను సమర్పించలేదని, అలానే ఇంజనీర్లు, ఇతర సిబ్బందిని తమకు కేటాయించలేదని సదరు సంస్ధ తెలిపింది. దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ఈ క్రమంలోనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.

గల్వాన్‌ లోయ ఘర్షణ తర్వాత చైనాపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. చైనాపై ఆర్థికపరమైన చర్యలు చేపట్టాలని.. దాదాపు 100 రకాల చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు 5జీతో పాటు ఎలాంటి ఇతర కాంట్రాక్టులను భారత కంపెనీలు సొంతం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. అటు ప్రజలు సైతం తాము ఇవాళ్టి నుంచి చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
First published: June 18, 2020, 6:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading