భారత ఆర్మీ ముగ్గురు చైనీస్‌‌ను రక్షిస్తే, చైనా మనవారిని ఐదుగురిని కిడ్నాప్ చేసింది

దారితప్పిన చైనీయులకు ఆహారం అందిస్తున్న భారత సైనికులు

Indian Army: 17,500 అడుగుల ఎత్తులో ఉండే పర్వత ప్రాంతాల్లో దారితప్పిన ఆ ముగ్గురిని భారత సైనికులు గుర్తించి కాపాడారు. వారిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు.

  • Share this:
    Chinese Military Kidnap Indians: దారి తప్పి తిరుగుతున్న ముగ్గురు చైనా పౌరులను భారత ఆర్మీ రక్షించింది. నార్త్ సిక్కింలోని ప్లటావులో ఆ ముగ్గుర్ని ఈనెల 3వ తేదీన గుర్తించింది. 17,500 అడుగుల ఎత్తులో ఉండే పర్వత ప్రాంతాల్లో దారితప్పిన ఆ ముగ్గురిని భారత సైనికులు గుర్తించి కాపాడారు. వారిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంలో వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని గ్రహించిన భారత సైనికులు వారికి వెంటనే మెడికల్ సాయం కూడా అందించారు. వారికి ఆక్సిజన్, ఆహారం, వెచ్చని దుస్తులు లాంటివి అందజేశారు. వారు అక్కడి వాతావరణం నుంచి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన వస్తువులు అందజేశారు. అనంతరం వారు ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని, మార్గనిర్దేశం కూడా చేశారు. దారి తప్పి తిరుగుతున్న వారికి దారి చూపించారు. అనంతరం ఆ ముగ్గురు తమ దారిన వెళ్లిపోయారు. భారత సైనికులు చేసిన సాయానికి ముగ్గురు చైనా పౌరులు తమ కృతజ్ఞత తెలిపారు. భారత్‌కు, భారత సైనికులకు ధన్యవాదాలు తెలిపారు.    శత్రుదేశానికి చెందిన వారైనా కూడా వారికి తిండి పెట్టి, ధైర్యం చెప్పి ఇంత సేవ చేశారు. అదే సమయంలో చైనా చేసిన ఓ పని వెలుగులోకి వచ్చింది. భారత్‌కు చెందిన ఐదుగురిని చైనీస్ మిలటరీ కిడ్నాప్ చేసినట్టు వారి కుటుంబసభ్యులు ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబాన్సిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. సినో - ఇండియా బోర్డర్‌లో ఉండే కొన్ని కుటుంబాలకు చెందిన వారు వేటకు వెళ్లగా, వారిలో ఐదుగురిని చైనీస్ మిలటరీ కిడ్నాప్ చేసింది. మరో ఇద్దరు చాకచక్యంగా తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: