చైనాపై భారత్ పైచేయి.. పాంగాంగ్ సరస్సు ఉత్తరాన సైన్యం పాగా

ప్రతీకాత్మక చిత్రం

తూర్పు లద్దాఖ్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన ఫింగర్‌-4 పర్వత శిఖరాలను ఆధీనంలోకి తీసుకోవడంతో చైనాపై భారత్ పైచేయి సాధించించినట్లయింది. లద్దాఖ్‌లో చైనా కవ్వింపులతో అప్రమత్తమైన భారత సైన్యం.. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లోనూ బలగాల మోహరింపును పెంచింది

 • Share this:
  సరిహద్దుల్లో డ్రాగన్ రెచ్చిపోతోంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని చెబుతూనే.. కయ్యానికి కాలు దువ్వుతోంది. జూన్‌లో గల్వాన్ లోయలో చెలరేగిపోయిన చైనా ఆర్మీ.. తాజాగా పాంగాంగ్ సరస్సు వద్ద ఘర్షణకు దిగింది. సరిహద్దుల్లో పదే పదే రెచ్చగొడుతున్న చైనా ఆర్మీకి భారత సైన్యం దీటుగా బదులిస్తోంది. చైనాతో ఘర్షణకు కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్ సరస్సు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనా బలగాలకు గట్టి షాక్ ఇస్తూ ఇప్పటికే పాంగాంగ్ దక్షిణ తీరంలోని పర్వత ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్న భారత బలగాలు... తాజాగా సరస్సుకు ఉత్తరాన కూడా పాగా వేశాయి.

  పాంగాంగ్‌కు ఉత్తర తీరంలో ఫింగర్‌-4 ప్రాంతంలోని పర్వత శిఖరాలపైకి భారత ప్రత్యేక బలగాలు చేరుకున్నాయని భారత సైన్యం వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే చైనా సైనికులు అక్కడికి చేరుకొని స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. చైనా దూకుడుకు చెక్ పెడుతూ ఆ స్థావరాలకు ఎదురుగానే భారత దళాలు స్థావరాలు ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఇరుదేశాల సైనికులు అతి దగ్గరగా ఎదురెదురుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఐతే మన సైనికులు మాత్రం వాస్తవాధీన రేఖను దాటి ముందుకు వెళ్లలేదని సైనిక వర్గాలు తెలిపాయి. బలగాల మోహరింపులో భాగంగా ముందుజాగ్రత్త చర్యగా మాత్రమే ఫింగర్‌ 4 ప్రాంతంలో అత్యంత కీలకమైన పర్వత శిఖరాలపైకి చేరుకున్నట్లు వెల్లడించారు.

  కాగా, తూర్పు లద్దాఖ్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన ఫింగర్‌-4 పర్వత శిఖరాలను ఆధీనంలోకి తీసుకోవడంతో చైనాపై భారత్ పైచేయి సాధించించినట్లయింది. లద్దాఖ్‌లో చైనా కవ్వింపులతో అప్రమత్తమైన భారత సైన్యం.. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లోనూ బలగాల మోహరింపును పెంచింది. 3,400 కి.మీ. పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని బలగాలకు సూచించింది. అంజా జిల్లా సరిహద్దుకు పెద్ద మొత్తంలో బలగాలను తరలిస్తోంది.
  Published by:Shiva Kumar Addula
  First published: