Home /News /india-china /

INDIAN ARMY CHIEF AWARDS COMMENDATION CARDS TO SOLDIERS WHO FOUGHT CHINESE TROOPS IN FACE OFFS IN LADAKH BA

చైనీస్ ఆర్మీతో పోరాడిన భారత సైనికులకు ఆర్మీ చీఫ్ ప్రశంసా పత్రాలు..

లద్దాక్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే (Image;ANI)

లద్దాక్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే (Image;ANI)

లద్దాక్‌లో చైనీస్ లిబరేషన్ ఆర్మీతో పోరాడిన వారికి భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ప్రశంసా పత్రాలు అందజేశారు.

    లద్దాక్‌లో చైనీస్ లిబరేషన్ ఆర్మీతో పోరాడిన వారికి భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈరోజు ఆయన లద్దాక్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటించారు. జవాన్లతో ముచ్చటించారు. తూర్పు లద్దాక్‌లోపి పాంగాంగ్ సో లేక్, గాల్వాన్ లోయలో చైనీస్ సైనికులు, భారత ఆర్మీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అందులో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. ఈ ఘర్షణ తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నిన్న క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు పలు సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు. గాల్వన్ లోయలో చైనీస్ సైన్యంతో జరిగిన ఘర్షణలో గాయపడి, ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారత సైనికులను పరామర్శించారు. వారిలో ధైర్యం నింపారు. లద్దాక్ పర్యటనకు వెళ్లడానికి ముందే గత సోమవారం ఢిల్లీలో ఓ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. టాప్ ఆర్మీ కమాండ్లతో సమావేశపై భద్రతను గురించి చర్చించారు.
    First published:

    Tags: India-China, Indian Army, Indo China Tension, Manoj Mukund

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు